నేటి నుంచి రంగనాయక స్వామి బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2020-03-02T11:45:25+05:30 IST
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరంగనాథుడు వెలసిన శ్రీరంగనాయకస్వామి ఆలయంలో మార్చి 2వ తేదీ నుంచి ఉగాది వరకు

శ్రీరంగాపూర్: అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీరంగనాథుడు వెలసిన శ్రీరంగనాయకస్వామి ఆలయంలో మార్చి 2వ తేదీ నుంచి ఉగాది వరకు బ్రహ్మోత్సవాలు, జాతర ఉంటుందని ఆలయ నిర్వహకులు తెలిపారు. ఈ నెల 2న కోయిలాళ్వార్ తిరుమంజనం పుణ్యాహ వాచన, అంకురార్పణ, 3న ద్వజారోహణ చౌరిపూజ, దేవతాహ్వానం, 4న మూల మంత్ర హోమం, వీఽధి పుణ్యాహవాచన, సూర్య ప్రభ ఉత్సవం, 5న మూలమంత్ర హోమం, శేషవాహన, తిరు వీధి ఉత్సవం, 6న మూలమంత్ర హోమం, హనుమంత వాహన, మండపోత్సవం, 7న సాయం త్రం 6 గంటలకు మహనీసేవా, 8న తిరువీధి ఉత్సవం, రథాంగ హోమం, గజవాహన సేవ, 9న పౌర్ణమి రోజున ఉదయం 10 గంటలకు రాత్రి 10 గంటలకు రథోత్సవం, 10న మూలమంత్ర హోమం, పారువేట, ఆశ్వవాహన సేవ, 11న పుర్ణాహుతి, అవబృతం, ద్వజ అవరోహనం, తీర్థప్రసాద వితరణ, నాగవల్లి ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 9న జరిగే రథోత్సవం ఉగాది వరకు జాతర జరుగుతుం ది. జాతరకు ఈ ప్రాంత ప్రజలతో పాటు దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు. 9న జరగనున్న రథోత్సవం ఉత్సవాలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, ఆలయ ధర్మకర్త శ్రీకృష్ణదేవరాయులు, వనపర్తి జిల్లా ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.