-
-
Home » Telangana » Mahbubnagar » rajoli
-
రాజోలి వద్ద భక్తుల సందడి
ABN , First Publish Date - 2020-11-22T03:34:48+05:30 IST
పుష్కరాలకు వచ్చిన భక్తులతో రాజోలి ఘాట్ వద్ద శనివారం సందడి నెలకొంది.

రాజోలి, నవంబరు 21: పుష్కరాలకు వచ్చిన భక్తులతో రాజోలి ఘాట్ వద్ద శనివారం సందడి నెలకొంది. రెండు వేల మంది భ క్తులు స్నానాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
వీఐపీ ఘాట్ వద్ద ఎమ్మెల్యే
పుష్కర ఘాట్‌ను ఎమ్మెల్యే అబ్రహాం సందర్శించారు. వీఐపీ ఘాట్ వద్ద తలపై నీళ్లు చల్లుకుని, సూర్య నమస్కారాలు చేశారు. ముబారక్ హెల్పింగ్ నేచర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భక్తులకు టీ, బిస్కెట్‌ల పంపిణీని ప్రారంభించారు. వైకుంఠనారాయణ స్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ సుగుణమ్మ, రాజు, సర్పంచు వెంకటేశ్వరమ్మ, ఉప సర్పంచు గోపాల్, నాయకులు పాల్గొన్నారు. పుష్కరాలపై పోలీసుల నీఘా ఉందని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. వైకుంఠ నారాయణ స్వామి ఆలయ వద్ద ఉన్న పుష్కరఘాట్‌ను శనివారం ఎస్‌ఐ శ్రీనివా్‌సతో కలిసి సందర్శించారు.