-
-
Home » Telangana » Mahbubnagar » pv indian teevi book opening
-
పీవీ దేశానికే ఠీవీ పుస్తకావిష్కరణ
ABN , First Publish Date - 2020-12-31T03:05:48+05:30 IST
భారత దేశ మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సిం హారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రముఖ సాహితీ పరిశోధకుడు కవి రచ యిత వేదార్థం మధుసూదన్‌శర్మ పేర్కొన్నారు.

కొల్లాపూర్, డిసెంబరు 30: భారత దేశ మాజీ ప్రధాని, దివంగత పీవీ నర్సిం హారావు బహుముఖ ప్రజ్ఞాశాలి అని ప్రముఖ సాహితీ పరిశోధకుడు కవి రచయిత వేదార్థం మధుసూదన్‌శర్మ పేర్కొన్నారు. బుధవారం కొల్లాపూర్ పట్టణం లో హైదరాబాద్‌కు చెందిన ఆర్థిక రంగ నిపుణులు, సాహితీవేత్త డా.కర్నాటి లింగయ్య రచించిన నవభారత నిర్మాత పీవీ దేశానికే ఠీవీ అనే పుస్తకాన్ని తెలుగు భారతి సాహితీ సంస్థ ఆధ్వర్యంలో కొల్లాపూర్ పట్టణంలో సాహి తీప్రియులు, కవిరచయితలు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన వేదార్థం మధుసూదన్‌శర్మ మాట్లాడుతూ గొప్ప సాహిత్యకారునిగా, బహుగ్రంథకర్తగా, బహుభాషాకోవిదుడిగా, సంస్కరణ రూపశిల్పిగా, మార్గదర్శి గా, స్వాతంత్య్ర సమరయోధుడిగా, భారత ప్రధానిగా తెలుగుజాతిని నలు దేశా లకు చాటిన ఘనుడు పీవీ నర్సింహారావు అని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ కర్నాటి లింగయ్య రచించిన పుస్తకంలో పీవీ జీవితంలో ముఖ్య ఘ ట్టాలున్నాయని ఆయన అభినందించారు. తెలుగు భారతి సంస్థ అధ్యక్షుడు ఆ మని కృష్ణ, కవులు డా.గూడెళ్లి శ్రీనయ్య, డా.రాంచందర్‌రావు, వేముల కోటయ్య, రాజేందర్‌రెడ్డి, వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.