ప్రైవేట్‌ పనులకు పుర ట్యాంకర్‌

ABN , First Publish Date - 2020-12-28T03:26:28+05:30 IST

పేట జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో రూ.40లక్షలతో చిల్డ్రన్‌ పార్కు నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకు న్నాడు. అయితే, ఆ కాంట్రాక్టర్‌ తాను జిల్లా అధికారి మనిషిని అంటూ మునిసిపల్‌ ట్యాంకర్‌, ఎక్స్‌కవేటర్‌లను సైతం వాడుకుంటున్నాడని తెలిసింది.

ప్రైవేట్‌ పనులకు పుర ట్యాంకర్‌

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 27: పేట జిల్లా కేంద్రంలోని 6వ వార్డులో రూ.40లక్షలతో చిల్డ్రన్‌ పార్కు నిర్మాణానికి ఓ కాంట్రాక్టర్‌ టెండర్‌ దక్కించుకు న్నాడు. అయితే, ఆ కాంట్రాక్టర్‌ తాను జిల్లా అధికారి మనిషిని అంటూ మునిసిపల్‌ ట్యాంకర్‌, ఎక్స్‌కవేటర్‌లను సైతం వాడుకుంటున్నాడని తెలిసింది. సదరు కాంట్రాక్టర్‌ తన సొంత వాహనాలు, అద్దె వాహనాలు వాడాల్సి ఉండగా ఆ కాంట్రాక్టర్‌ జిల్లా అధికారి పేరు చెప్పుకుంటూ మునిసిపల్‌ ట్యాంకర్‌, ఎక్స్‌కవేటర్‌ను వాడుకోవడం విడ్డూరమని పలువురు చర్చించు కుం టున్నారు. అయితే, మునిసిపల్‌ అధికారులు కూడా ఎదురు చెప్పలేక పోతు న్నారు వారిపై జిల్లా అధికారి ఒత్తిడి సైతం ఉన్నట్లు సమాచారం. ఈ విషయమై మునిసిపల్‌ కమిషనర్‌ శ్రీనివాసన్‌ను వివరణ కోరగా మునిసిపల్‌ ఆధ్వర్యంలో చదును చేయాల్సి ఉండడంతో ట్యాంకర్‌ వాడుకున్నారని, ఎక్స్‌కవేటర్‌ వాడుకుంటున్నట్లు తనకు తెలియదని సమాధానం దాట వేశారు. 

Updated Date - 2020-12-28T03:26:28+05:30 IST