పునరావాస కేంద్రాల్లో లే అవుట్లు వేయండి: కలెక్టర్
ABN , First Publish Date - 2020-12-12T03:28:54+05:30 IST
జడ్చర్ల మండలం ఉద్దండాపూర్, వల్లూర్ గ్రామాల పునరావాస కేంద్రాల్లో లేఅవుట్ ప్రిపరేషన్, ఎస్టిమే షన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు.
కలెక్టరేట్, మహబూబ్‌నగర్ డిసెంబరు 11: జడ్చర్ల మండలం ఉద్దండాపూర్, వల్లూర్ గ్రామాల పునరావాస కేంద్రాల్లో లేఅవుట్ ప్రిపరేషన్, ఎస్టిమే షన్ సిద్ధం చేయాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబ ర్‌లో ఆయా శాఖల అధికారులతో సమావేశమ య్యారు. ఉద్దండాపూర్, వల్లూర్ గ్రామాల్లో పునరా వాసం కింద చేపట్టే నిర్మాణాలకు సంబంధించి లేఅవుట్, ఎస్టిమేట్ తయారు చేయాలని, ఈ ప్ర క్రియ ఈ వారంలో పూర్తి కావాలని ఆదేశించారు. పునరావాస కేంద్రాల్లో రోడ్లు, పాఠశాల భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాలు, పార్కులు, రైతు వేదికలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏఎన్‌ఎం సబ్ సెంటర్లు, వెటర్నరీ ఆసుపత్రులు, కమ్యూనిటీ హాళ్లు, గ్రామ పంచాయతీ భవనాలు, ఫంక్షన్ హా ళ్లు, వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, విద్యుత్ కనెక్ష న్లు, వైకుంఠ ధామాలు, డంపింగ్ యార్డులు, గ్రా మ పోస్టాఫీస్ కార్యాలయా భవనాలు, ప్లే గ్రౌండ్ నిర్మాణాలు తదితర అవసరాలకు సంబంధించిన నిర్మాణాలను చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చే సుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఈ నెల 18న నిర్వహించే సమావేశానికి పూర్తి స్థాయి సమాచారం తీసుకురావాలని సంబంధిత శాఖా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఆర్‌అండ్‌ఆర్‌కు సంబంధించి సోషియో ఎకనామిక్ సర్వే నిర్వహిం చామని తెలిపారు. లేఅవుట్ ప్రిపేర్ చేసేందుకుగా ను ఒక కమిటీని ఏర్పాటు చేశామని వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు సీతారామారావు, తేజస్ నందలాల్‌పవర్, డీఆర్‌ఓ కె.స్వర్ణలత, ఆర్ అండ్‌బీ, పంచాయతీరాజ్, ఉద్యానవన శాఖ, డీఎస్ ఎంఐడీసీ పాల్గొన్నారు.