వేల కుటుంబాలకు జీవనోపాధి కరువు

ABN , First Publish Date - 2020-12-18T04:50:52+05:30 IST

ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పథకాల ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలై వేల కుటుంబాలకు జీవనో పాధి కరువైందని దస్తా వేజు లేఖరుల సంఘం జిల్లా కన్వీనర్‌ రాగివేణు అన్నారు.

వేల కుటుంబాలకు జీవనోపాధి కరువు
ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, దస్తావేజు లేఖరులు

- ఆర్డీఓ కార్యాలయం ముందు దస్తావేజు లేఖరుల ధర్నా

    వనపర్తి టౌన్‌, డిసెంబర్‌ 17: ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ పథకాల ద్వారా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కుదేలై వేల కుటుంబాలకు జీవనో పాధి కరువైందని దస్తా వేజు లేఖరుల సంఘం జిల్లా కన్వీనర్‌ రాగివేణు అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్‌డీవో కార్యాలయం ముందు గురువారం నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎల్‌ఆర్‌ఎస్‌ పథకంతో సామాన్య ప్రజానీకం ఆర్థిక ఇబ్బందులకు గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జీవో నెంబర్‌ 131ని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి గతంలో హామీ ఇచ్చారని, కానీ నేటికీ నెరవేర్చలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాతపద్ధతిలోనే రిజిస్ర్టేషన్లు చేసేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో అమరేందర్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు నందిమళ్ల అశోక్‌, పరశురాం, గంధం కిషోర్‌, చిట్టిరాజుల చందు, జంగాల మన్నెం, ఉందెకోటి శ్రీకాంత్‌, మణివర్ధన్‌, కళ్యాణ్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-18T04:50:52+05:30 IST