-
-
Home » Telangana » Mahbubnagar » prati gimja
-
ప్రతి గింజా కొనుగోలు చేస్తాం
ABN , First Publish Date - 2020-11-26T04:21:39+05:30 IST
రైతులు పండించి న ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద ని,అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ సీతారామ రావు భరోసా ఇచ్చారు.

అదనపు కలెక్టర్ సీతారామరావు
వేములలో ఐకేపీ కొనుగోలు కేంద్రం పరిశీలన
మూసాపేట, నవంబరు 26 : రైతులు పండించి న ప్రతి గింజాను ప్రభుత్వం కొనుగోలు చేస్తుంద ని,అధైర్యపడొద్దని అదనపు కలెక్టర్ సీతారామ రావు భరోసా ఇచ్చారు. బుధవారం మండల పరిధిలోని వేముల గ్రామంలో ఐకేపీ ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని అదనపు కలెక్టర్ పరిశీలించా రు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడు తూ ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ధాన్యాన్ని కొ నుగోలు చేస్తామని, అపోహాలకు గురి కావద్దన్నా రు. రంగుమారిన వడ్లకు రైస్ మిల్లర్లలో ఏ రేటుకు తీసుకుంటారో అదేరేటుకు కొనుగోలు కేంద్రాలలో తీసుకుంటారన్నారు. ఈసారి అధికశాతం వరి పం డించారని, అయినా కొనుగోలు చేస్తామని,రైతులు సహకరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో రైతుబంధు జిల్లా అధ్యక్షుడు గోపాల్ యాదవ్, త హసీల్దార్ మంజుల, ఎంపీడీఓ ఉమాదేవి, డిప్యూటీ తహసీల్దార్ వరప్రసాద్, ఎం రాజేం దర్‌రెడ్డి, సర్పంచ్ అరుణ, రైతు బంధు మండల అధ్యక్షుడు రఘుపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు సత్యనారాయణ, రైతులు పాల్గొన్నారు.