సాంస్కృతిక ఉద్యమానికి సిద్ధం కావాలి

ABN , First Publish Date - 2020-12-12T04:10:45+05:30 IST

లోపభూయిష్టమైన విధానాలతో సాంస్కృతిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా కళాకారులందరూ సాంస్కృతిక ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు.

సాంస్కృతిక ఉద్యమానికి సిద్ధం కావాలి
సమావేశంలో మాట్లాడుతున్న శ్రీనివాస్‌

- ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌

    గద్వాలటౌన్‌, డిసెంబరు 11: లోపభూయిష్టమైన విధానాలతో సాంస్కృతిక రంగాన్ని చిన్నాభిన్నం చేస్తున్న పాలకుల తీరుకు వ్యతిరేకంగా కళాకారులందరూ సాంస్కృతిక ఉద్యమానికి సిద్ధం కావాలని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా నాట్య మండలి జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం సాంస్కృతిక రంగాన్ని నిర్వీర్యం చేసి కళాకారుల ఉపాధిని దెబ్బతీసిందన్నారు. ధూంధాం కార్యక్రమం ద్వారా గద్దెనిక్కిన కేసీఆర్‌ కళాకారుల సంక్షేమాన్ని విస్మరించడం దౌర్భాగ్యమన్నారు. పాలకుల తీరును ఎండగట్టేందుకు గ్రామీణ కళాకారులు, ప్రధానంగా జానపద కళాకారులు ఏకం కావాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎస్‌జీ అంజి, సీపీఐ జిల్లా కార్యదర్శి అంజనేయులు, ఏఐఎఫ్‌వై నాయకులు పరమేశ్‌, ప్రజానాట్యమండలి నాయకులు సుకుమార్‌, ఆశన్న,రాధాకృష్ణారెడ్డి, ధర్మవరం కృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-12T04:10:45+05:30 IST