-
-
Home » Telangana » Mahbubnagar » prabuthva
-
ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేసిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు
ABN , First Publish Date - 2020-12-11T03:30:56+05:30 IST
జనరల్ ఆసు పత్రిని గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహులు ఆకస్మికంగా తనిఖీ చేశా రు.

మహబూబ్‌నగర్, డిసెంబరు 10: జనరల్ ఆసు పత్రిని గురువారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు చిలకమర్రి నర్సింహులు ఆకస్మికంగా తనిఖీ చేశా రు. ఆసుపత్రిలోని మాతా శిశు సంక్షేమ విభాగం వార్డును పరిశీలించిన అనంతరం కేసీఆర్ కిట్ విభాగాన్ని పరిశీలించి అర్హులైన మహిళలకు కేసీఆర్ కిట్‌ను అందజేశారు. అనంతరం నవజాత శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శించి అక్కడ శిశువు లకు అందుతున్న సేవలను గమనించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని రోగులతో మాట్లాడిన ఆయన వారికి అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రికి పేదలు వస్తుంటారని, వారి ఆరోగ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత వైద్యులపై ఉన్నదన్నారు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేయాలని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాంకిషన్‌కు సూచించారు. కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రభుత్వం వసతులను కల్పిస్తోందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ కళాశాల డైరెక్టర్ డా.పుట్ట శ్రీనివాస్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీవన్, ఆర్‌ఎంఓ డా.విజయ్, డా.రాగవేని, డా.రాధిక పాల్గొన్నారు.