-
-
Home » Telangana » Mahbubnagar » powerhouse checking jainco cmd
-
పవర్‌హౌస్‌ను పరిశీలించిన జెన్‌కో సీఎండీ
ABN , First Publish Date - 2020-12-16T03:47:57+05:30 IST
శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు.

నాగర్‌కర్నూల్, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ఉత్పాదన కేంద్రాన్ని జెన్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు మంగళవారం పరిశీలించారు. పవర్‌హౌస్‌లో షార్ట్‌సర్క్యూట్ కార ణంగా జరిగిన ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టం సంభవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పవర్‌హౌస్‌లో ఏర్పడిన సాంకేతిక ఇబ్బందులను దాదాపు 5 నెలలపాటు శ్రమించి అధిగమించిన సిబ్బందిని అభినందించడంతో పాటు 5వ యూనిట్ నుంచి విద్యుత్ ఉత్పాదన ప్రక్రియను ప్రారంభించేలా జెన్‌కో సిబ్బందిని సమాయత్తం చేసేందుకు సీఎండీ ప్రభాకర్‌రావు ఆకస్మికంగా పవర్‌హౌస్‌ను పరిశీలించడం గమనార్హం.