-
-
Home » Telangana » Mahbubnagar » pm photo ledani nirasana
-
ప్రధాని ఫొటోలేదని బీజేపీ నిరసన
ABN , First Publish Date - 2020-12-31T03:10:25+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ని ర్మించిన రైతు వేదికలపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టాల ని బీజేపీ నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల నాయకులు రైతు వేదిక ముందు బుధవారం నిరసన వ్యక్తం చేసేందుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు.

బిజినేపల్లి, డిసెంబరు 30 : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ని ర్మించిన రైతు వేదికలపై ప్రధాని నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని బీజేపీ నాగర్‌కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల నాయకులు రైతు వేదిక ముందు బుధవారం నిరసన వ్యక్తం చేసేందుకు రాగా పోలీసులు అరెస్టు చేశారు. పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్త లు మోదీ చిత్రపటాన్ని తీసుకుని వ్యవసాయ పొలాల మీదుగా పోలీసుల కళ్లు గప్పి ప్రారంభ సభావేదిక దగ్గరకు పరుగున చేరుకున్నారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై వారిని అదుపులోకి తీసుకున్నారు. రైతువేదిక నిర్మాణానికి వెచ్చించిన నిధుల్లో రూ. 12 లక్షల వరకు కేంద్రం నిధులే వినియోగించినా దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఫొటో పెట్టకుండా టీఆర్‌ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మ భ్యపెట్టి ఓటు రాజకీయాలు చేస్తోందని ఈ సందర్భంగా నాయకు లు విమర్శించారు. ఆందోళన చేపట్టిన బీజేపీ నాయకులను పోలీసు లు అదుపులోకి తీసుకొని బిజినేపల్లి పోలీసు స్టేషన్‌కు తరలించారు.