పీఎం దిష్టిబొమ్మ దహనం

ABN , First Publish Date - 2020-12-06T03:58:25+05:30 IST

కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

పీఎం దిష్టిబొమ్మ దహనం

పద్మావతి కాలనీ, డిసెంబరు 5: కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. ఢిల్లీలో రైతు లు చేస్తున్న నిరంతర ఆందోళనకు వారు సంఘీభావం ప్రకటించారు. శనివారం జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కడియాల మోహన్‌, రాజ్‌కుమార్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వై.లక్ష్మయ్య, ప్రశాంత్‌, భరత్‌, రమేష్‌, రాము, ప్రవీణ్‌ పాల్గొన్నారు.  

రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి 


పాలమూరు: కేంద్రం రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి.పరమేశ్వర్‌గౌడ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం పార్టీ కార్యాలయంలో జరిగిన వామపక్షాల ఐక్య సమావేశం లో ఆయన మాట్లాడారు. ఈ చట్టాల్లో పంటలకు కనీ స మద్దతు ధరపై భరోసా లేకుండా పోయిందని ఆవే దన వ్యక్తం చేశారు. స్వామి నాథన్‌ కమిషన్‌, జయతి ఘోష్‌ కమిటీ సిఫార్సులను తక్షణం అమలు చేయాల న్నారు. ఢిల్లీలో ఆందోళ చేస్తున్న రైతులకు వారు సం ఘీభావం ప్రకటించారు. సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్ర సీ జిల్లా కార్యదర్శి రాంచందర్‌, సీపీఎం జిల్లా నాయ కులు చంద్రకాంత్‌, సీపీఐ జిల్లా కార్యద ర్శివర్గ సభ్యు డు బాలకిషన్‌, మాకం రామ్మోహన్‌, సురే ష్‌, ఎన్‌డీ నాయకులు వెంకేటశ్‌, సీపీఎం నాయకులు భరత్‌, విజయ్‌, రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. 

సీఐటీయూ ఆధ్వర్యంలో..


బాలానగర్‌: దేశ రాజధానిలో రైతులు పది రోజుల నుంచి ఆందోళన కార్యక్రమాలు చేస్తుంటే ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోవడం లేదని శనివారం మండ ల కేంద్రంలో పీఎం దిష్టి బొమ్మను సీఐటీయూ ఆధ్వ ర్యంలో దహనం చేశారు. ఈ సందర్భంగా దీప్ల నాయ క్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశా రు. కార్యక్రమంలో భీమ్లా, చందర్‌ నాయక్‌, టోప్య, ఈశ్వర్‌, నరేందర్‌, హతిరాం  పాల్గొన్నారు. 

కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో..


బాదేపల్లి: కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ, కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని నేతాజీ చౌర స్తాలో కల్లకు నల్ల బట్టలను కట్టుకొని నిరసన తెలి పారు. కార్యక్రమంలో నాయకులు పరుశురాం, నాగరా జు, బాలకృష్ణ, నరసింహ, గోపాల్‌రెడ్డి, ఆంజనేయులు, జగన్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-06T03:58:25+05:30 IST