ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి : డీఈవో

ABN , First Publish Date - 2020-12-12T04:24:15+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పంచాయతీలు కృషి చేయాలని డీఈఓ రవీందర్‌ అన్నారు.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయండి : డీఈవో
సమావేశంలో మాట్లాడుతున్న డీఈవో రవీందర్‌

ధన్వాడ, డిసెంబరు 11 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు పంచాయతీలు కృషి చేయాలని డీఈఓ రవీందర్‌ అన్నారు. మండలంలోని మందిపల్లి గ్రామంలో శుక్రవారం ప్రభుత్వ పాఠశాలలో చైల్డ్‌ ఫ్రెండ్లీ స్కూల్‌ ఎంపికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఈఓ మాట్లాడుతూ పంచాయతీల పరంగా పాఠశాలలకు కావాల్సిన తాత్కాలిక పనులు చేపట్టాలని కోరారు. పాఠశాలల్లో ఉన్న ప్రధాన సమస్యల గురించి చర్చించారు. ఈ సమావేశంలో డీసీసీబీ మేనేజర్‌ వెంకట్‌రాములు, సర్పంచ్‌, సీఆర్పీ నారాయణ, ప్రధానోపాధ్యాయులు వాగ్దేవి పాల్గొన్నారు.

Updated Date - 2020-12-12T04:24:15+05:30 IST