-
-
Home » Telangana » Mahbubnagar » plastic is dangerious to human life
-
ప్లాస్టిక్‌తో మనుగడకే ప్రమాదం
ABN , First Publish Date - 2020-12-20T02:57:50+05:30 IST
ప్లాస్టిక్‌తో మానవ మనుగడకే ప్రమాదం అని ముని సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు.

మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్
వనపర్తి పురపాలకం, డిసెంబరు 19: ప్లాస్టిక్‌తో మానవ మనుగడకే ప్రమాదం అని ముని సిపల్ చైర్మన్ గట్టుయాదవ్ అన్నారు. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై అవగాహన ర్యాలీని నిర్వహించారు. పురపాలిక నుంచి రాజీవ్ చౌక్, ఇందిరా పార్కు, గాంధీచౌక్ మీదుగా రామాలయం వరకు తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ ప్రజలు ప్లాస్టిక్ వాడాకాన్ని తగ్గించాలన్నారు. ప్రతీ ఒక్కరు క్లాత్, జ్యూట్ సంచులు వాడాలని సూచించారు. ఇకపై ప్లాస్టిక్‌ను వినియోగిస్తే భారీ స్థాయిలో జరిమానలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, కౌన్సిల్ సభ్యులు, పారిశుధ్య కార్మికులు, అధికారులు పాల్గొన్నారు.
బాధిత కుటుంబానికి ఆర్థికసాయం
ప్రమాదవశాత్తు మృతిచెందిన మునిసిపల్ కార్మికుడు రాములు కుటుంబాన్ని ఆదుకోవాలని గత నెలలో నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. ఈమేరకు శనివారం మృతుడి భార్యకు రూ.94వేల ఆర్థికసాయాన్ని అందించారు. అనంతరం ఆయన మునిసిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కార్మికుల సమస్యలతో పాటు వారికి భధ్రత కల్పిచడం భాధ్యత అన్నారు. కౌన్సిలర్ మహేష్, నాగన్న, కంచె రవి తదితరులు ఉన్నారు.