పీజీ కళాశాల స్థలాన్ని పరిరక్షించండి

ABN , First Publish Date - 2020-12-29T03:43:30+05:30 IST

కొల్లాపూర్‌ పట్టణంలోని పీజీ కళాశాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మాజీ మం త్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌కు వినతి పత్రం అందజేశారు.

పీజీ కళాశాల స్థలాన్ని పరిరక్షించండి
ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పిస్తున్న దృశ్యం

-మాజీ మంత్రి జూపల్లి వర్గీయుల డిమాండ్‌

కొల్లాపూర్‌, డిసెంబరు 28: కొల్లాపూర్‌ పట్టణంలోని పీజీ కళాశాల స్థలాన్ని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వర్గీయులు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రభాకర్‌కు  వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కొల్లాపూర్‌ మునిసిపాలిటీ 10వ వార్డు కౌన్సిలర్‌ షేక్‌ రహీంపాషా, సింగిల్‌ విండో డైరెక్టర్‌ పి.నర్సింహ, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎండి.ఎక్బాల్‌, యన్మన్‌బెట్ల మాజీ సర్పంచ్‌ నాగరాజు మాట్లాడారు.  కొ ల్లాపూర్‌ పీజీ కళాశాల కోసం నాడు మంత్రిగా ఉన్న జూపల్లి కృష్ణారావు మంజూ రు చేయించి అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి నిర్మాణం చేప ట్టారు. పీజీ కళాశాలకు చెందిన 92వ సర్వే నెంబరులో కొంతమంది ప్లాట్లు వేసి లక్షల రూపాయలకు అమ్ముకుంటున్నారని, ఈ విషయంపై జిల్లా కలెక్టర్‌కు, పా లమూరు వైస్‌ చాన్సలర్‌కు కూడా ఫిర్యాదు చేశామన్నారు. ప్రభుత్వ స్థలమైన పీజీ కళాశాల స్థలాన్ని పరిరక్షించాలని ప్రిన్సిపాల్‌ను కోరారు. అదేవిధంగా క్యాంపస్‌ చు ట్టూ కాంపౌండ్‌ వాల్‌ వెంటనే నిర్మించేలా కృషి చేయాలని వినతి పత్రంలో పేర్కొ న్నారు. నాయకులు మేకల కిశోర్‌యాదవ్‌, కిరణ్‌యాదవ్‌, పి.వెంకటేశ్‌, రమేష్‌ముది రాజ్‌, దిలీప్‌శెట్టి, కర్నె శివ, రెడ్డి సత్యం, నయీమ్‌, ఎండి.ముస్తాక్‌, రాజుయాదవ్‌ తదితరులు ఉన్నారు. 


Updated Date - 2020-12-29T03:43:30+05:30 IST