పేటలో కలుషిత నీరు సరఫరా

ABN , First Publish Date - 2020-11-26T03:18:05+05:30 IST

జిల్లా కేంద్రమైన నారాయణపేటలో రెండు రోజులుగా మిషన్‌ భగీరథ తాగునీరు కలుషితమై సరఫరా అవుతుంది.

పేటలో కలుషిత నీరు సరఫరా

నారాయణపేట, నవంబరు 25: జిల్లా కేంద్రమైన నారాయణపేటలో రెండు రోజులుగా మిషన్‌ భగీరథ తాగునీరు కలుషితమై సరఫరా అవుతుంది. దీంతో పట్టణ ప్రజలు ఆ నీటిని తాగేందుకు జంకుతున్నారు. ఒకవైపు కరోనా మరోవైపు కలుషిత నీటి సరఫరాతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా సంబంధిత అదికారులు మిషన్‌ భగీరథ నీరు కలుషితం కాకుండా సరఫరా చేయాలని కోరుతున్నారు.

Read more