రోడ్ల విస్తరణకు సహకరించాలి

ABN , First Publish Date - 2020-12-31T02:53:38+05:30 IST

పట్టణాభివృద్ధి కోసం చేపట్టిన రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అన్నారు.

రోడ్ల విస్తరణకు సహకరించాలి
వ్యాపారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆల, కలెక్టర్‌ యాస్మిన్‌ బాషా

కలెక్టర్‌  షేక్‌ యాస్మిన్‌బాషా

కొత్తకోట, డిసెంబరు 30: పట్టణాభివృద్ధి కోసం చేపట్టిన రోడ్ల విస్తరణకు ప్రజలు సహకరించాలని కలెక్టర్‌ యాస్మిన్‌బాషా అన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డితో కలిసి ఆమె బుధవారం కొత్తకోట రోడ్ల వెంట పర్యటించారు. ఈ సందర్భంగా చిరు వ్యాపారులు, దుకాణదారులతో మాట్లాడారు. అనంతరం మునిసిపల్‌ కార్యాలయంలో  అధికారులతో సమావేశం నిర్వహించి వచ్చేనెల 5న రోడ్డు కటింగ్‌ అవుతున్న ప్రభుత్వ భవనాలు, ప్రహరీని తొలగించాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ కౌన్సిలర్లు ఇండ్ల, దుకాణ యాజమానులతో మాట్లాడి కటింగ్‌ అవుతున్న వరకు తొలగించుకొనుటకు ఒప్పించాలన్నారు. సుకేశిని,  వామన్‌గౌడ్‌, గుంత మౌనిక, చెన్నకేశవరెడ్డి,   కొండారెడ్డి, రాములు యాదవ్‌, రాంమోహన్‌రెడ్డి, పద్మ, తిరుపతి పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-31T02:53:38+05:30 IST