ప్రజలు గృహ స్వీయ నిర్బందం పాటించాలి

ABN , First Publish Date - 2020-04-18T10:24:33+05:30 IST

జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన కరోనా వైరస్‌ నివారణకు

ప్రజలు గృహ స్వీయ నిర్బందం పాటించాలి

 డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ 

 2000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ 


అచ్చంపేట/బల్మూరు/ఉప్పునుంతల, ఏప్రీల్‌ 17: జిల్లాలోని అన్ని మండలాలు గ్రామాల ప్రజలు ప్రభుత్వం ప్రకటించిన కరోనా వైరస్‌ నివారణకు  గృహ స్వీయ నిర్బంధం పాటించాలని డీసీసీ అధ్యక్షుడు డాక్టర్‌ వంశీకృష్ణ అన్నారు. ఆయన శుక్రవారం అమ్రామాద్‌ మండలంలోని తుర్కపల్లి, వెంటేవ్వర్లభావి, మాచారం, గ్రామాలలోని పేద, నిరుపేద వారికి దాదాపు 2000 కుటుంబాలకు 9 రకాల నిత్యావసర సరుకులు 10రోజులకు సరిపడా కూరగాయలు, బియ్యం తదితర సరుకులు పంపిణీ చేశారు. 


కార్యక్రమంలో అమ్రాబాద్‌ జడ్పీటీసీ డాక్టర్‌ అనురాధ, ఎంపీపీ నివాసులు, గ్రామాల సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. అలాగే, బల్మూరు మండలంలోని పోలీశెట్టిపల్లి గ్రామంలో గట్టు జయప్రకాశ్‌రెడ్డి సహకారంతో దాదాపు 50మందికి వారం రోజులకు సరిపడే నిత్యావసర సరుకులను మాజీ ఎమ్మెల్యే డా.వంశీకృష్ణ పంపిణీ చేశారు. మండల  పరిధిలోని లత్తిపూర్‌ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పం,చ్‌ మల్లేష్‌  గ్రామ ప్రజలకు వారం రోజులకు సరిపడ నిత్యావస సరకులు పంపిణి చేశారు. 

Updated Date - 2020-04-18T10:24:33+05:30 IST