పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2020-09-20T08:45:26+05:30 IST

జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ సూచించారు...

పెండింగ్‌ పనులను పూర్తి చేయాలి

స్థాయీ సంఘాల సమావేశాల్లో జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ 


నారాయణపేట టౌన్‌, సెప్టెంబరు 19 : జిల్లాలో అసంపూర్తిగా ఉన్న పనులను వెంటనే పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులకు జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ సూచించారు. శనివారం జిల్లా పరిషత్‌లో నిర్మాణ పనులు, ప్రణాళిక, ఆర్థిక, సాంఘిక సంక్షేమ స్థాయీ సంఘాల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ అధ్యక్షత వహించి మాట్లాడారు. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందు దెబ్బతిన్న విద్యుత్‌ స్తంభాలను, లైన్లను వ్యవసాయ పొలాల్లో ఉండే వైర్ల విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాల, లైన్‌మెన్లు, ఏఈలు అందుబాటులో ఉండి నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అలాగే మిషన్‌ భగీరథ పైపులైను లీకేజీలను వెంటనే సరి చేయాలని భగీరథ ఈఈకి సూచించారు. మక్తల్‌, మరికల్‌లో నిర్మిస్తున్న మినీ ట్యాంక్‌ బండ్‌ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలన్నారు. దామరగిద్ద నారాయణపేట రోడ్డు పనులకు నిధులు మంజూరైనందున త్వరగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో జడ్పీ సీఈఓ కాళిందిని, డిప్యూటీ సీఈఓ సిద్రామప్ప, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ వహీద్‌, సంబంధిత జిల్లా శాఖ అధికారులు పాల్గొన్నారు.


కొత్త రెవెన్యూ చట్టంతో రైతులకు మేలు : వనజ

ముఖ్యమంత్రి కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తేవడం ద్వారా రైతులకు ఎంతో మేలు జరుగుతుందని జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ అన్నారు. శనివారం జడ్పీ చైర్‌ పర్సన్‌ వనజ తన చాంబర్‌లో జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు ఎంఏ వహీద్‌లో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ కొత్త రెవెన్యూ చట్టం తేవడం పట్ల జిల్లా రైతులు, ప్రజల తరపున ఆమె సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2020-09-20T08:45:26+05:30 IST