పట్టించినా.. పట్టింపేదీ?

ABN , First Publish Date - 2020-11-26T02:57:52+05:30 IST

అక్రమ మట్టి తరలింపును అడ్డుకుని అధికారులకు పట్టించినా చూసీచూడనట్లు వ్య వహరిస్తున్న వైనం ఇది.

పట్టించినా.. పట్టింపేదీ?
మట్టి తరలిస్తున్న వాహనాన్ని ఫోటో తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ కరుణాకర్‌

- అక్రమ మట్టి దందాకు అధికారుల వత్తాసు 

ఊర్కొండ, నవంబరు 25: అక్రమ మట్టి తరలింపును అడ్డుకుని అధికారులకు పట్టించినా చూసీచూడనట్లు వ్య వహరిస్తున్న వైనం ఇది. అక్రమ మట్టి దందాకు వ త్తాసు పలుకుతున్న రెవెన్యూ అధికారుల తీరుపై మండ లంలోని జగబోయిన్‌పల్లి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా పోలీసు, రెవెన్యూ అధికారులు నిమ్మకునీరెత్తి నట్లు వ్యవహరిస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నా యి. నవంబరు 4న అక్రమ మట్టి తరలింపు శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో వార్త ప్రచురితం కావడంతో గత కొన్ని రోజులుగా స్తబ్ధుగా ఉన్నా... మంగళవారం రాత్రి, బుధ వారం ఉదయం మరోసారి ఎలాంటి అనుమతులు లేకు న్నా స్థానికంగా నిర్మాణంలో ఉన్న జిన్నింగ్‌ మిల్లుకు రెవె న్యూ,   పోలీసుల అండదండలతో మట్టి తరలింపును కొ నసాగించారు. స్థానికుల సమాచారంతో గ్రామస్థులు అ డ్డుకోవడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకుని స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడితో వాహనాల ను పంపించివేశారు. ఈ తతంగంపై గ్రామస్థులు ఆ గ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మట్టి తరలింపుతో జగబోయిన్‌పల్లి-వెల్జాల్‌ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిం దని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతా ధికారులు స్పందించి ఈ అధికారులపై చర్యలు తీసుకో వాలని  కోరుతున్నారు. కాగా, ఈ విషయమై ఆర్డీవో రాజేష్‌కుమార్‌ను సంప్రదించగా తహసీల్దార్‌ ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలుసుకుంటానని తెలియజేశారు. 


Updated Date - 2020-11-26T02:57:52+05:30 IST