-
-
Home » Telangana » Mahbubnagar » parishudyam py
-
పారిశుధ్యంపై దృష్టి సారించండి
ABN , First Publish Date - 2020-11-22T03:33:29+05:30 IST
పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు.

అయిజ, నవంబరు 21: పారిశుధ్య చర్యలపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. శనివారం మండల పరిధిలోని వేణిసోంపూర్ పుష్కర ఘాట్‌ను ఆయన సందర్శించారు. భక్తుల ఏర్పా ట్లను పరిశీలించారు. ఘాట్‌ల పక్కన బురద లేకుం డా ఇసుక వేయించాలన్నారు. కార్యక్రమంలో ఘాట్ ఇన్‌చార్జి శ్రీనివాసులు, నర్సింహారెడ్డి, వైద్యాధికారి రామలింగారెడ్డి, ఆర్‌ఐ లక్ష్మిరెడ్డి పాల్గొన్నారు. ఘాట్‌కు రెండో రోజు శనివారం భక్తులు పెరిగారు. మొదటి రోజు 425 మంది రాగా, శనివారం సాయంత్రం 5 గంటల వరకు 570 మంది వచ్చారు.