పంటలు ఎండుతున్నాయ్‌

ABN , First Publish Date - 2020-11-20T03:46:13+05:30 IST

మండలంలో కేఎల్‌ఐ కాలువల్లో నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉంటే రైతుల గుండెలు మండుతున్నాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు.

పంటలు ఎండుతున్నాయ్‌
కేఎల్‌ఐ కాలువలను పరిశీలిస్తున్న ఎల్లేని సుధాకర్‌రావు

బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు


కోడేరు, నవంబరు 19 : మండలంలో కేఎల్‌ఐ కాలువల్లో నీళ్లు లేక పంటలు ఎండుతూ ఉంటే రైతుల గుండెలు మండుతున్నాయని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతులను నట్టేటా ముంచుతుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు అన్నారు. గురువారం మండలం లోని ముత్తిరెడ్డిపల్లి, సింగాయిపల్లి, తుర్కదిన్నె తదితర గ్రామాల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో ముఖా ముఖి చర్చించినప్పుడు వారి ఆవేదన, ఆందోళనలు ఎల్లేని దృష్టికి తీసుకొచ్చారు. యాసంగి పంటలు ఎండిపోతున్నాయని పంటలకు నీళ్లురాక కేఎల్‌ఐ కాలువలు మొత్తం ఎండిపోయాయన్నారు. ఎండి పోయిన పంటలు చూసి ఎల్లేని చలించిపోయారు. పంటలకు నీళ్లు త్వరగా ఇవ్వాలి, ఒకవేళ నీళ్లు వదలని పక్షంలో రైతులతో కలిసి ఆం దోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్ర మంలో బీజేపీ జిల్లా కార్యదర్శి గువ్వలి వెంకటయ్య, కోడేరు మండల కార్యదర్శి బాలపీరు, రాఘవేందర్‌, సీనియర్‌ నాయకులు గోపాల్‌రా వు, గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-20T03:46:13+05:30 IST