పేదలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి

ABN , First Publish Date - 2020-05-18T10:46:13+05:30 IST

రెండు నెలలుగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న దృష్ఠ్యా పేదలు తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కుంటున్నారని, వారిని ప్రతి ఒక్కరూ ఆదు కోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫో రం అధ్యక్షుడు పల్లె రవికుమార్‌ అన్నారు.

పేదలకు ప్రతి ఒక్కరూ చేయూతనివ్వాలి

తెలంగాణ జర్నలిస్టుల ఫోరం అధ్యక్షుడు పల్లెరవికుమార్‌


మహబూబ్‌నగర్‌, మే 17 : రెండు నెలలుగా లాక్‌ డౌన్‌ కొనసాగుతున్న దృష్ఠ్యా పేదలు తీవ్ర ఇబ్బందుల ను ఎదుర్కుంటున్నారని, వారిని ప్రతి ఒక్కరూ ఆదు కోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ జర్నలిస్ట్‌ ఫో రం అధ్యక్షుడు పల్లె రవికుమార్‌ అన్నారు. ఆదివారం మహబూబ్‌నగర్‌ మండల పరిధిలోని మాచన్‌పల్లి గ్రా మంలో తెలంగాన జిల్లా జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యం లో పేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన పల్లె రవికుమార్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని, మానవత్వంతో వారిని ఆదుకోవాలని కోరారు.


లాక్‌డౌన్‌ నిబంధనలు పాటిస్తూ నే పేదలకు చేతనైనంత సాయం అందించాలన్నారు. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని కోరారు. కరోనా మహమ్మారిని తరిమికొట్టాలంటే ఎవ రికి వారు జాగ్రత్తలు పాటించాలని, నిర్లక్ష్యం చేస్తే వై రస్‌ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్నారు. కా ర్యక్రమంలో ఫోరం ఉపాధ్యక్షుడు కాసాని శ్రీనివాసరా వు, ప్రధాన కార్యదర్శి మేకల కృష్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, సర్పంచ్‌ మల్లికార్జున్‌రెడ్డి, టీజేఎఫ్‌ సభ్యు లు జగదీశ్‌గౌడ్‌, శ్రీనివాస్‌ యాదవ్‌, నవీన్‌కుమార్‌, రా మస్వామి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-05-18T10:46:13+05:30 IST