పచ్చద నం, పరిశుభ్రతకు పెద్దపీట

ABN , First Publish Date - 2020-12-21T03:01:17+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాయి.

పచ్చద నం, పరిశుభ్రతకు పెద్దపీట
పచ్చదనంగా పరిశుభ్రంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మునిసిపల్‌ చైర్మన్‌

రెండ్రోజుల్లో పది వార్డులో అవగాహన కార్యక్రమంమహబూబ్‌నగర్‌, డిసెంబరు 20: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నాయి. ఇందులో భాగంగానే పాలమూరు పురపాలికలో పచ్చదనంగా.. పరిశుభ్రంగా.. ఆరోగ్యంగా.. మన మహబూబ్‌నగర్‌ మరి యు స్వచ్ఛ సర్వెక్షన్‌ అనే కార్యక్రమం చేపడుతున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆదివారం మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సిం హులు లాంఛనంగా ప్రారంభించారు. పట్టణంలో 49 వార్డులు ఉండగా ఐదు బృందాలను ఏర్పాటు చేశారు. ఒక్కో బృందానికి పది వార్డుల్లో అవగాహన కల్పించే బాధ్యతలను అప్పగిం చా రు. ఈ బృందం రెండ్రోజులపాటు పది వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇంట్లోనే తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి మునిసపల్‌ వాహనాలకు అందిం చాలని ప్రజలను చైతన్యం చేస్తారు. తడి చెత్తతో ఇంట్లోనే కంపోస్ట్‌ ఎరువును ఎలా తయారు చేసుకోవచ్చో కూడా వివ రిస్తారు. మొక్కలను నాటి సంరక్షించాలని, ఎవరి ఇంటి ముందు చెట్టు ఉంటే వాళ్ళు నీళ్లు పోసి ఆ మొక్కను సంర క్షించాలని తెలియజేస్తారు. అదేవిధంగా మిషన్‌ భగీరథ నీటినే వినియోగించాలని, వృథా కాకుండా నల్లాలకు మూతలు బిగించాలని తెలియజేస్తారు. ప్లాస్టిక్‌ కవర్లను, సింగిల్‌ యూజ్‌ కవర్లను వినియోగించకూడదని అవగాహన కల్పించనున్నారు. మొత్తంగా పచ్చదనం.. పరిశుభ్రంతోపాటు ఆరోగ్యాన్ని సంరక్షిం చుకునే కార్యక్రమాలపై ప్రజలకు పెద్దఎత్తున అవగాహన కల్పించనున్నారు. 

స్వచ్ఛ ఆటోల బాధ్యతారాహిత్యం


పాలమూరు పురపాలికలో 45 స్వచ్ఛ ఆటోల ద్వారా ఇంటింటికి చెద్ద సేకరణ కార్యక్రమం చేస్తున్నారు. వీరంతా తమ భాద్యతలను తూచ తప్పకుండా పాటిస్తే తడి పొడి చెత్తను సులువుగా వేరు చేయవచ్చు. ఆటో ట్రాలీని రెండు పార్ట్‌లుగా విభజించి తడి పొడి చెత్తలను వేర్వేరుగా ఇళ్ల వద్దనే సేకరిం చాలి. అలా కాకుండా రెండింటిని కలిపి ఒకే చోట వేస్తున్నారు. పొడి చెత్తనే వేరు చేసి టీడీగుట్టలోని డీఆర్‌సీ సెంటర్‌కు తీసు కెళ్తే కిలోల లెక్కన కొనుగోలు చేస్తారు. దీని వల్ల స్వచ్ఛ ఆటో నిర్వాహకులకు మంచి ఆదాయం రానుంది. రోజూ రూ. 300-400 వరకు పొడి చెత్త ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. అయితే చాలా మంది నిర్లక్ష్యంగా చెత్త సేకరిస్తున్నారు. అవగాహన కల్పిస్తే చాలా వరకు ఆటోలలోనే తడి, పొడి వేర్వేరుగా సేకరించే అవకాశం ఉంటుంది. 

Updated Date - 2020-12-21T03:01:17+05:30 IST