1,66,800 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

ABN , First Publish Date - 2020-09-16T06:31:22+05:30 IST

శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మంగళవారం కూడా కొనసాగింది. జూరాల నుంచి 50,274 క్యూసెక్కులు, పవర్‌హౌజ్‌ నుంచి 34,365,

1,66,800 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

(నాగర్‌కర్నూల్‌-ఆంధ్రజ్యోతి) : శ్రీశైలం ప్రాజెక్టుకు వరద మంగళవారం కూడా కొనసాగింది. జూరాల నుంచి 50,274 క్యూసెక్కులు, పవర్‌హౌజ్‌ నుంచి 34,365, సుంకేశుల నుంచి 43,110, హంద్రీ నుంచి 1,125 క్యూసెక్కుల నీరు జలాశయంలోకి వచ్చి చేరుతుంది. వరద ఉధృతి ఆధారంగా ఆరు గేట్లు ఎత్తి దిగువకు 1,66,800 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. 


87,063 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

ధరూరు : జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. మంగళవారం 84 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ఏడు గేట్లను ఎత్తి 50,274 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. మరో 34,635 క్యూసెక్కులను విద్యుత్‌ ఉత్పత్తికోసం వినియోగిస్తున్నారు. ఎత్తిపోతల పథకాలకు కలుపుకొని మొత్తం 87,063 క్యూసెక్కుల నీరు ఔట్‌ఫ్లోగా నమోదైంది. 


నాలుగు గేట్ల ఎత్తివేత

దేవరకద్ర : మహబూబ్‌నగర్‌ జిల్లా దేవకరద్ర మండలంలోని కోయిల్‌సాగర్‌ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. మంగళవారం సాయంత్రానికి ప్రాజెక్టులో 32.5 అడుగులకు నీరు చేరింది. దీంతో అధికారులు నాలుగు గేట్లను ఎత్తి, దిగువకు రెండు వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు నీటి పారుదల శాఖ డీఈ రవీందర్‌రెడ్డి తెలిపారు.


40 వేల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో

రాజోలి : జోగుళాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని సుంకేసుల బ్యారేజీకి టీబీ డ్యాం నుంచి భారీగా వరద నీరు వస్తోంది. జలాశయం గరిష్ఠ నీటి మట్టం 292.00 మీటర్లకు గాను మంగళవారం 291.08 మీటర్లకు చేరడంతో సాయంత్రం పది గేట్లను ఎత్తి, దిగువకు 40 వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.


12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో

మక్తల్‌ రూరల్‌ : భారీ వర్షాలకు నారాయణపేట జిల్లా మక్తల్‌ మండలంలోని చిట్టెం నర్సిరెడ్డి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ (సంగంబండ)కు భారీగా వరద చేరుతోంది. 12 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మంగళవారం ఐదు గేట్లను ఎత్తి దిగువకు పది వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నట్లు ఈఈ చక్రధర్‌ తెలిపారు.


తెరుచుకున్న సైఫన్‌ గేట్లు

మదనాపురం : వనపర్తి జిల్లా మదనాపురం మండలంలోని సరళాసాగర్‌ ప్రాజెక్టు ఆటోమెటిక్‌ సైఫన్‌ గేట్లు మూడు మంగళవారం తెరుచుకున్నాయి. ఎగువ నుంచి వరద ఎక్కువగా రావడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. ఈ సీజన్‌లో మూడో సారి సైఫన్‌ గేట్లు తెరుచుకోవడం విశేషం.

Updated Date - 2020-09-16T06:31:22+05:30 IST