పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు చేయాలి
ABN , First Publish Date - 2020-12-16T04:25:51+05:30 IST
పాత పద్ధతిలో రిజస్ట్రేషన్లు చేయాలని ప్రజలు, బిల్డర్లు, రియల్టర్లు డిమాండ్ చేశారు.
పాలమూరు, డిసెంబరు 15: పాత పద్ధతిలో రిజస్ట్రేషన్లు చేయాలని ప్రజలు, బిల్డర్లు, రియల్టర్లు డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రం లోని రిజిస్ట్రేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. కొత్త పద్ధతిలో రిజిస్ట్రేషన్‌తో ఎన్నో సమస్యలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ లో స్లాట్‌బుక్ కాలేదన్నారు. ఆన్‌లైన్ సర్వర్ సపోర్ట్ చేయటం లేదన్నారు. పీటీఐఎన్, టీపీఐఎన్ రద్దు చేసి, ఎల్‌ఆర్‌ఎస్, బీఆర్‌ఎస్, బీపీఎస్‌లేని వాటిని కూడా రిజిస్ట్రేషన్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అధికారికి వినతి పత్రం అందజేశారు.