మనిషిని మహోన్నతంగా నిలిపిన అగ్నివేష్‌

ABN , First Publish Date - 2020-09-13T09:16:58+05:30 IST

సమాజంలో మనిషిని యోగి స్వామి అగ్నివేష్‌ మహోన్న తంగా నిలిపారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, పాలమూరు ..

మనిషిని మహోన్నతంగా నిలిపిన అగ్నివేష్‌

ఒబేతుల్లా కొత్వాల్‌, ఎం.రాఘవాచారి


పాలమూరు, సెప్టెంబరు 12: సమాజంలో మనిషిని యోగి స్వామి అగ్నివేష్‌ మహోన్న తంగా నిలిపారని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌, పాలమూరు అధ్యయన వేదిక ఉమ్మడి జిల్లా కన్వీనర్‌ ఎం.రాఘవాచారి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టీఎఫ్‌టీయూ కార్యాలయంలో పి.వి జయ్‌ కుమార్‌ అధ్యక్షతన స్వామి అగ్నివేష్‌ సంతాప సభను నిర్వహించారు. ఈ సభలో ప్రజా స్వామిక వాదులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల ప్రతి నిధులు పా ల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1983లో అగ్నివేష్‌ మొదటిసారి మహబూబ్‌నగర్‌కు వచ్చినప్పుడు మని షి ఎవరి ముందు తలదించకపోవడమే కర్తవ్యంగా జీవిం చాలని చెప్పారన్నారు. 2014లో దళితులు, మైనారిటీలపై దాడులకు నిరసనగా టౌన్‌హాలులో జరిగిన సభలో సందేశాత్మక ఉపన్యాసం ఇచ్చా రన్నారు. కేంద్రంలో ఎన్‌డీఏ ఫాసిస్టు పాలన కొనసా గిస్తున్నదని దేశవ్యాపితంగా ప్రచారం చేశారన్నా రు. ఆ క్రమంలోనే మతోన్మాదులు ఛత్తీస్‌ఘడ్‌లో ఆయనపై భౌతిక దాడికి పూనుకున్నారన్నారు. ఆయ న ఆదర్శమూర్తి అని అన్నారు. కార్య క్రమంలో సీపీఐ నాయకులు కె.రామక్రిష్ణ, టీఎఫ్‌ టీయూ ఎస్‌.ఎం.ఖలీల్‌, ఎంసీపీఐ పడమటి చిన్న, న్యూడె మోక్రసీ సి.వెంకటేష్‌, ఎన్‌.కురు మూర్తి, ఎంఆర్‌ జేఏసీ హనీఫ్‌అహ్మద్‌, డీటీఎఫ్‌ శివరాజప్ప, ఖాజా మైనొద్దీన్‌, రాంచందర్‌, జలాల్‌పాష పాల్గొన్నారు. 


పేదల గొంతుక

స్వామి అగ్నివేష్‌ పేదల గొంతుకగా నిలిచా రని టీడీఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు కె.వామన్‌ కుమార్‌, జె.వెంకటేష్‌ అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలో డీటీఎఫ్‌ ఆధ్వ ర్యంలో అగ్నివేష్‌ సంతాప సభను నిర్వహించారు. మంత్రి పదవికి రాజీ నామా చేసి, సన్యాసిగా కోరికలన్నీ త్యజించా రన్నారు. మాన వత్వమంటే మతం కాదని, ప్రజలంతా స్వేచ్ఛగా, సుఖంగా ఉండాలని కోరుకున్న గొప్ప మనిషన్నారు. కార్య క్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు. 


ఆర్య సమాజం అభివృద్ధికి కృషి

జడ్చర్ల: ఆర్య సమాజం అభివృద్ధికి స్వామి అగ్నివేష్‌ ఎంతో కృషి చేశారని రాష్ట్ర సంగీత, నాటక అకాడమీ చైర్మన్‌, ఆర్యప్రతినిధి సభ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాద్మి శివకుమార్‌ అన్నారు. జడ్చర్లలోని ఆర్య సమాజంలో శనివారం అగ్నివేష్‌ చిత్ర పటానికి పూలమాల వేసి, నివాళులు అర్పిం చారు. ఈ సందర్భంగా శివకుమార్‌ మాట్లాడు తూ సామాజిక కార్యకర్తగా సమాజానికి ఎంతో మేలు చేసిన వ్యక్తి అగ్నివేష్‌ అని కొనియాడారు. కార్యక్రమంలో స్వాతంత్య్ర సమరయోధురాలు సుఖదాదేవి, జడ్చర్ల ఆర్య సమాజం ప్రధాన్‌ బాద్మిస్రవంతి, మంత్రి గుబ్బ నర్సిములు, కోశాధికారి బొడ్ల విజయ్‌కుమార్‌, బక్కరాజు, అశోక్‌, కృష్ణయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-13T09:16:58+05:30 IST