-
-
Home » Telangana » Mahbubnagar » nurseries
-
నర్సరీలు సిద్ధం చేయండి
ABN , First Publish Date - 2020-11-26T02:59:43+05:30 IST
మొక్కల పెంపకానికి అవసరమైన నర్సరీలు సిద్ధం చేయాలని ఉపాధి హామీ ఏపీడీ నా గేంద్రం అన్నారు.

ఉపాధి హామీ ఏపీడీ నాగేంద్రం
అయిజ, నవంబరు 25: మొక్కల పెంపకానికి అవసరమైన నర్సరీలు సిద్ధం చేయాలని ఉపాధి హామీ ఏపీడీ నా గేంద్రం అన్నారు. స్థానిక మండలపరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. వచ్చే సంవత్సరానికి మొక్కల పెంపకం కోసం ఇప్పటి నుంచే పనులు ప్రారంబించాలన్నా రు. ప్రస్తుతం ఉన్న మొక్కలను సంరక్షించాలని తెలిపారు. ప్రతీ పంచాయతీ పరిధిలో ప్రతీ రోజు 50మంది కూలీలకు తక్కువ కాకుండా ఉపాధి పనులు వారి చేత చేయించాలని ఆదేశించారు. ఎంపీడీవో సాయిప్రకాష్, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ అధికారులు హాజరయ్యారు.