ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2020-11-22T03:53:25+05:30 IST

పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఫ్రీ ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వాలని ఎస్పీ చేతన అ న్నారు.

ప్రతి ఫిర్యాదుపై కేసు నమోదు చేయాలి: ఎస్పీ
ధన్వాడ పోలీస్‌స్టేషన్‌లో రికార్డులను పరిశీలిస్తున్న ఎస్పీ

ధన్వాడ, నవంబరు21: పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ప్రతీ ఫిర్యాదు పై కేసు నమోదు చేసి ఫ్రీ ఎఫ్‌ఐఆర్‌ ఇవ్వాలని ఎస్పీ చేతన అ న్నారు. శనివారం ధన్వాడ పోలీస్‌ స్టేషన్‌ను ఎస్పీ ఆకస్మికంగా  తనిఖీ చేశారు.  ఈసందర్భంగా స్టేషన్‌లో రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్టేషన్‌కు వచ్చే బాధి తులకు పూర్తి భరోసా కల్పించాలన్నారు. కేసుల దర్యాప్తులో అలస త్వం వహించొద్దని  ఆదేశించారు.  ఎస్పీ వెంట సీఐ ఇఫ్తేకార్‌ అహ్మద్‌, ఎస్‌ఐ రాజేందర్‌, కానిస్టేబుళ్లు ఉన్నారు. 

Read more