అద్దె చెల్లించని వారికి నోటీసులు

ABN , First Publish Date - 2020-07-22T11:07:04+05:30 IST

జిల్లాలోని ఎస్సీ కాంప్లెక్స్‌ అద్దె చెల్లించని వారికి లీ గల్‌ నోటీసులు పంపించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌

అద్దె చెల్లించని వారికి నోటీసులు

నాగర్‌కర్నూల్‌ టౌన్‌, జూలై 21: జిల్లాలోని ఎస్సీ కాంప్లెక్స్‌ అద్దె చెల్లించని వారికి లీ గల్‌ నోటీసులు పంపించాలని ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, డీఆర్వో మధుసూదన్‌నాయక్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో జి ల్లాలోని ఎస్సీ కాంప్లెక్స్‌ దుకాణాదారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా 51 దుకాణాలను నిర్వహిస్తున్నారన్నారు. ఐదేళ్లుగా అద్దెలు చెల్లించని వారికి నోటీసులు పంపగా ఈ నెల 14లోగా కొంతమంది అద్దె చెల్లించారన్నారు. మిగతా వారు రేపటిలోగా అద్దెను చల్లిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. 

Updated Date - 2020-07-22T11:07:04+05:30 IST