నోముల నర్సింహయ్య మృతికి సంతాపం తెలిపిన మంత్రి, ఎంపీ
ABN , First Publish Date - 2020-12-02T04:00:24+05:30 IST
నల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతిపట్ల మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిలు సంతాపం తెలిపారు.
మహబూబ్‌నగర్, డిసెంబరు 1 : నల్గొండ జిల్లా నాగా ర్జున సాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల నర్సింహ్మయ్య మృతిపట్ల మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డిలు సంతాపం తెలిపారు. చివరిశ్వాస వరకు నోముల ప్రజలకోసం పనిచేశారని, ఆయన సేవలు ఎప్పటీకి ప్రజల్లో గుర్తుండిపోతాయన్నారు. ఆయన మరణం తీరనిలోటన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం ఎన్నో సేవలందించారని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.