కల్లాల్లోనే ధాన్యం

ABN , First Publish Date - 2020-11-28T03:00:06+05:30 IST

నివర్‌ తుపాన్‌ ఉమ్మడి పాలమూరును తాకింది.

కల్లాల్లోనే ధాన్యం
నారాయణపేట జిల్లా అప్పిరెడ్డిపల్లిలో వరి ధాన్యం కుప్పలను ప్లాస్టిక్‌ కవర్లతో కప్పిన దృశ్యం

- ఉమ్మడి పాలమూరు జిల్లాను తాకిన నివర్‌ తుపాను

- గురువారం నుంచి వీస్తున్న ఈదురు గాలులు

- శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కమ్మేసిన ముసురు

- మూతపడిన వ్యవసాయ మార్కెట్లు 

- నిలిచిన ధాన్యం కొనుగోళ్లు

- వరి కోతలకు అన్నదాతలకు తప్పని కష్టం


(గద్వాల/వనపర్తి-ఆంధ్రజ్యోతి), మహబూబ్‌నగర్‌/నా రాయణపేట, నవంబరు 27 : నివర్‌ తుపాన్‌ ఉమ్మడి పాలమూరును తాకింది. గురువారం వాతావరణం మే ఘావృతమై ఉండగా, శుక్రవారం తెల్లవారుజాము నుంచి ఉమ్మడి జిల్లా అంతటా ముసురు కురిసింది. చల్లటి గా లులతో పాటు తేలికపాటి జల్లులు, ముసురు పడటంతో చిత్తడిగా మారింది. తుపాన్‌ కారణంగా 26, 27, 28వ తే దీల నుంచి పాలమూరు జిల్లాలోని 194 కొనుగోలు కేం ద్రాలలో ధాన్యం కొనుగోళ్లను నిలిపివేయడంతో రైతుల ధాన్యం కల్లాల్లోనే మగ్గుతోంది. వర్షం ప్రభావం ఆగిపోతే 29 నుంచి కొనుగోళ్లను ప్రారంభిస్తామని వ్యవసాయ అ ధికారులు చెప్తున్నారు. అయితే, వర్షం కారణంగా వరి పై రు పలుచోట్ల నేలకొరిగింది. అప్పటికే కొనుగోలు చేసిన ధాన్యం తడవకుండా చూసుకునేందుకు అన్నదాతలు ఆ పసోపాలు పడాల్సి వచ్చింది. స్థలం లేని వాళ్లు రోడ్లపై ధాన్యం కుప్పలు గా పోసి టార్పాలి న్‌లను కప్పి ఉం చారు. మరి కొందరు కల్లాల్లో ధాన్యం తడవ కుండా ఉండేందుకు ఇ బ్బంది పడాల్సి వస్తోంది. ఇక పంట కోద్దామ నుకునే సమయంలో వర్షంకు రవడం వల్ల మరికొద్ది రోజులు కొసుకోలేని ప రిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వరికోత యంత్రాలు దొరకక కోతలు ఆలస్యమవుతోంది. ఈ వర్షానికి మరి కొన్నాళ్లు పంటకోసుకునే పరిస్థితి లేక గింజలు రాలిపోయే ప్రమా దముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. 


నివర్‌ ప్రభావంతో వనపర్తి జిల్లాలో ముసురు కురు స్తోంది. ప్రస్తుతం వరి కోతలు నడుస్తున్నందున రైతాం గం తీవ్రంగా నష్టపోయే అవకా శం ఉంది. శుక్రవారం ఉదయం నుంచి కురుస్తున్న ముసురు, ఈదు రు గాలులకు కోతకు సిద్ధంగా ఉన్న వే లాది ఎకరాల వరి పంట నేలకొరిగింది. దీంతో గింజలు రాలిపోవడంతో పాటు రాలని గింజలు కూడా నీటిలో ఉండి మొలకెత్తే అవకాశం ఉం ది. సుమా రు 20 నుంచి 30 వేల ఎకరాల వరి పంటపై తుపాన్‌ ప్రభావం ఉండనుంది. 

కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకురావద్దని మూ డు రోజుల ముందు నుంచే అధికారులు సూచిస్తుండడం తో రైతులు జాగ్రత్తపడ్డారు. 

జోగుళాంబ గద్వాల జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి ముసురు కురుస్తూనే ఉంది. జిల్లాలో 35.8 మి ల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వ్యవసాయాధికారులు, కలెక్టర్‌ ముందస్తుగా రైతులను అప్రమత్తం చేయడంతో చేతికి వచ్చిన దిగుబడులను వర్షానికి తడవకుండా భద్ర పరుచుకున్నారు. కొన్ని చోట్ల వరి చేలు నేలకొరిగింది. వ్య వసాయ మార్కెట్‌కు సెలవును ప్రకటించారు. 

నారాయణపేట జిల్లాలో శుక్రవారం ముసురు కురు స్తూనే ఉంది. కోసి వరి కుప్పలను కాపాడుకునేందుకు రైతులు ఇబ్బందులు పడ్డారు. ప్లాస్టిక్‌ కవర్లు కప్పుకున్నా ధాన్యంలో తేమ శాతం పెరుగుతుందని అంటున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోళ్లు నిలిపివేశారు.

అలాగే నాగర్‌కర్నూల్‌ జిల్లాలో రోజంతా ఈదురు గా లులు వీచాయి.

Updated Date - 2020-11-28T03:00:06+05:30 IST