నివర్‌ తుపాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2020-11-27T03:26:29+05:30 IST

నివర్‌ తుపాన్‌ ప్రభావం నాగర్‌ కర్నూల్‌ జిల్లాపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం హె చ్చరికలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

నివర్‌ తుపాన్‌ ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి
జిల్లా ఏరియా ఆసుపత్రిలో సర్కారీ ఊయలను ప్రారంభిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

- జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నివర్‌ తుపాన్‌ ప్రభావం నాగర్‌ కర్నూల్‌ జిల్లాపై తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందని జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తాము పండించిన ధాన్యాన్ని తుపాన్‌ ప్రభావం తగ్గే వరకు పత్తి, వరి ఇతర ధాన్యాలను కొనుగోలు కేంద్రాలకు తీసుకురావద్దని జిల్లా రైతాంగానికి సూచించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని కాపాడుకోవాలని రైతులు ఎవరు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.  రైతులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ క్షేత్రస్థాయిలో అందరూ వ్యవ సాయ పంచాయతీరాజ్‌, రెవెన్యూ, మార్కెటింగ్‌, సివిల్‌ సప్లయ్‌ అధికారులు పర్యటించాలని కలెక్టర్‌ ఆదేశిం చారు. రైతులు తమ పంట చేతికొచ్చిన ఈ సమ యంలో రెండు రోజుల పాటు తుపాన్‌ ప్రభావం పట్ల అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. 

సర్కారీ ఊయల ఏర్పాటు

నవజాత శిశువుల సంరక్షణే లక్ష్యంగా మహిళాభివృద్ధి సంక్షేమ శాఖ ఆధ్వర్యం లో గురువారం జిల్లా ఏరియా ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ చేతుల మీదుగా సర్కారీ ఊయలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లా డుతూ  నవజాత ఆడపిల్లలను కంపచెట్లలో, ముళ్ల పొదల్లో, మురికి కాలువల్లో పడేస్తున్నారని, ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఎవరికైనా తమ పిల్లలు భారమన్పిస్తే నాగర్‌కర్నూల్‌, కల్వకుర్తి, కొల్లాపూర్‌, అచ్చంపేట, అమ్రాబాద్‌ ప్రభుత్వ ఆసుపత్రులలో ఏర్పాటు చేసిన ఊయలలో వేసి వెళ్లాలని సూచించారు. ఈ పిల్లలకు ప్రభుత్వం ద్వారా భద్రత కల్పించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారిణి ప్రజ్వల, అసిస్టెంట్‌ కలెక్టర్‌ చిత్రమిశ్రా, డీసీపీవో ఇంతియాజ్‌, ఆసుపత్రి సూపరిం టెండెంట్‌ నాగభూషణం, సీడీపీవోలు దమయంతి, సంగీత పాల్గొన్నారు. 


Updated Date - 2020-11-27T03:26:29+05:30 IST