కొత్త కేసులు 512

ABN , First Publish Date - 2020-09-05T07:48:26+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో 512 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది...

కొత్త కేసులు 512

ఉమ్మడి పాలమూరులో ఆగని వైరస్‌ వ్యాప్తి

కరోనాతో ఇద్దరి మృతి


మహబూబ్‌నగర్‌ (విద్యావిభాగం)/ గద్వాలక్రైం/ నారాయణపేట క్రైం/ వనపర్తి/ ఖిల్లాగణపురం/ కందనూలు, సెప్టెంబరు 4 : ఉమ్మడి పాలమూరు జిల్లాలో 512 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఒకరు, వనపర్తి జిల్లాలో మరొకరు మృతి చెందారు. 

మహబూబ్‌నగర్‌ జిల్లాలో 145 కరోనా కేసులు నమోదయ్యాయి. అందులో జిల్లా కేంద్రంలో 39 మందికి వైరస్‌ సోకింది. వివిధ మండలాల్లో 106 కేసులు నమోదయ్యాయి. జడ్చర్లలో 44 మంది, ఇతర మండలాల్లో 66 మంది వైరస్‌ బారిన పడ్డారు. సీసీ కుంట మండలం కురుమూర్తి గ్రామంలో వృద్ధురాలు (61) కరోనాతో మృతి చెందింది. 


జోగుళాంబ గద్వాల జిల్లాలో 105 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. అందులో జిల్లా కేంద్రంలో ఏడుగురు కొవిడ్‌ బారిన పడ్డారు. అత్యధికంగా అయిజ మండలంలో 26 మందికి వైరస్‌ సోకగా, గట్టులో 13, క్యాతూరులో తొమ్మిది, వడ్డేపల్లిలో తొమ్మిది కేసులు నమోదయ్యాయి. మరో 41 కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి. 


వనపర్తి జిల్లాలో 95 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో వనపర్తి మండలంలో 48, పెబ్బేరులో 22, కొత్తకోటలో ఎనిమిది మంది కరోనా బారిన పడ్డారు. మరో 17 కేసులు వివిధ మండలాల్లో నమోదయ్యాయి. ఖిల్లాగణపురం మండల కేంద్రానికి చెందిన వ్యక్తి (65) కరోనాతో మృతి చెందాడు. 


నారాయణపేట జిల్లాలో 21 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. జిల్లా కేంద్రంలోని శ్రీనివాసకాలనీలో ముగ్గురికి వైరస్‌ సోకగా, కోస్గీలో ఆరుగురు, మక్తల్‌లో నలుగురు కరోనా బారిన పడ్డారు. ఇతర జిల్లాల్లో మరో ఎనిమిది కేసులు నమోదయ్యాయి. 


నాగర్‌కర్నూల్‌ జిల్లాలో 146 మందికి కరోనా నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా కల్వకుర్తిలో 22 మందికి వైరస్‌ సోకగా, తెలకపల్లిలో 20, అచ్చంపేటలో 13, బిజినేపల్లిలో 13, వెల్దండలో 13, నాగర్‌కర్నూల్‌లో 11, కొల్లాపూర్‌లో 11 మంది కరోనా బారిన పడ్డారు. ఇతర మండలాల్లో మరో 43 కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2020-09-05T07:48:26+05:30 IST