నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడుతాం

ABN , First Publish Date - 2020-12-21T03:00:48+05:30 IST

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు లకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.శ్రీ నివాసులు అన్నారు.

నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేదాకా పోరాడుతాం
అమరులైన రైతులకు సంతాపంగా మానవహారంగా ఏర్పడి నివాళులర్పిస్తున్న సీపీఎం నాయకులు

కందనూలు, డిసెంబరు 20: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతులకు నష్టం కలిగించే నూతన వ్యవసాయ చట్టాన్ని రద్దు చేసేంత వరకు ఉద్యమిస్తామని  సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఆర్‌.శ్రీ నివాసులు అన్నారు. ఢిల్లీలో గత 25రోజులుగా పోరాటం నిర్వహిస్తూ అమరులైన వారికి జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో ఆదివారం మానవహారం ఏర్పాటు చేసి నివాళులర్పించారు.  వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలు జర పాలని, సమస్యలు పరిష్కరించాలని కోరారు. సీపీఎం నాయకులు రామయ్య, అశోక్‌, వెంకట్‌, రాములు, భానుప్రకాశ్‌, శేఖర్‌, హన్మంతు, శివ తదితరులు పాల్గొన్నారు. 


రైతులకు మద్దతుగా మానవహారం 

కల్వకుర్తి అర్బన్‌: ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మ ద్దతుగా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం కల్వకుర్తి పట్టణంలో మానవహారం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.  సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆంజనేయులు, ఉపాధ్యక్షుడు పర్వతాలు, కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు పరుశరాములు, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్‌ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక నాయకుడు వెంక టయ్య, యూటీఎఫ్‌ నాయకులు ఏపీ మల్లయ్య, చిన్నయ్య, భవన ని ర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు యాదయ్య, హమాలీ సం ఘం నాయకులు కృష్ణయ్య, ఆర్టీసీ నాయకులు రాంచంద్రయ్య తదిత రులు పాల్గొన్నారు.


కొల్లాపూర్‌లో రాస్తారోకో  

కొల్లాపూర్‌: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేకచట్టాలను రద్దు చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి.ఈశ్వర్‌ డిమాండ్‌ చేశా రు. ఆదివారం పట్టణంలోని ఎన్‌టీఆర్‌ చౌరస్తాలో సీఐటీయూ ఆధ్వ ర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి డి.ఈశ్వర్‌ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులను సంక్షోభంలోకి నెట్టేసేలా ప్రత్యేక చట్టాలను అమలుపరుస్తుందని ధ్వజమెత్తారు. ఆవాజ్‌ సంఘం జిల్లా నాయకులు సలీం, ప్రజా సంఘాల నాయకులు భాస్కర్‌, రాజు, సత్యనారాయణ, వెంకటస్వామి, నర్సింహ్మ, శ్రీను, రామకృష్ణ, సుందరయ్య, కుర్మయ్య, శేషు పాల్గొన్నారు. 


Updated Date - 2020-12-21T03:00:48+05:30 IST