-
-
Home » Telangana » Mahbubnagar » New agricultural laws should be repealed
-
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలి
ABN , First Publish Date - 2020-12-20T04:06:06+05:30 IST
నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు ముందు చేపట్టిన ధర్నా శనివారం 5వ రోజుకు చేరింది.

నారాయణపేట, డిసెంబరు 19 : నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చే యాలని జిల్లా కేంద్రంలోని మునిసిపల్ పార్కు ముందు చేపట్టిన ధర్నా శనివారం 5వ రోజుకు చేరింది. అఖిల భారత పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ఢిల్లీలో కొనసాగుతున్న రైతుల పోరాటానికి మద్దతుగా చేపట్టిన ఈ ధర్నాకు అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చెన్నప్ప అధ్యక్షత వహించారు. పీవైఎల్ నాయకుడు కాశీనాథ్ మాట్లాడుతూ కేంద్ర ప్ర భుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను రైతులకు గొడ్డలిపెట్టులా ఉందని, రైతులతో చర్చలు జరిపి చట్టాలను రద్దుచేసి గిట్టుబాటు ధర కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డి, అఖిల భారతరైతుకూలీ సంఘం జిల్లా అధ్యక్షు డు సలీం, యాదగిరి, పీఓడబ్ల్యు జిల్లా అధ్యక్షు రాలు జయలక్ష్మి, అంజిలయ్యగౌడ్, ఏఐకేఎంఎస్ ప్రశాంత్, హాజిమలాంగ్, చంద్రాములు, హన్మం తు, శ్రీను, ప్రతాప్, నర్సిములు, సాయికుమార్ పాల్గొన్నారు.
రైతాంగ ఉద్యమానికి నిధి సేకరణ
నారాయణపేట టౌన్/ దామరగిద్ద : ఢిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభా వంగా దామరగిద్దలో టీ వ్యవసాయ కార్మిక సం ఘం ఆధ్వర్యంలో శనివారం విరాళాలు సేక రించారు. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని 25 రోజులుగా ఢిల్లీలో రైతులు ఉద్యమిస్తు న్నారని వారికి సంఘీభావంగా విరాళాలు సేకరిస్తున్న ట్లు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకుడు గోపాల్ తెలిపారు. రూ.4900 నిధి సేకరించి ఉద్యమా నికి పంపామన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకు లు శివ కుమార్, ఖాజా, జోషి, ప్రకాష్, షేర్ ఖాన్, రాజేందర్, భీంసేన్ పాల్గొన్నారు.