రైతులతో చర్చలు సఫలం చేయాలి

ABN , First Publish Date - 2020-12-28T03:21:24+05:30 IST

రైతులతో చర్చలను సఫలం చేసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు.

రైతులతో చర్చలు సఫలం చేయాలి
ద్వజారోహణ పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న దృశ్యం

నారాయణపేట, డిసెంబరు 27 : రైతులతో చర్చలను సఫలం చేసి నూతన వ్యవసాయ చట్టాలను రద్దుచేయాలని అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి యాదగిరి, సీపీఎం జిల్లా కార్యదర్శి వెంకట్రామ్‌రెడ్డిలు డిమాండ్‌ చేశారు. అఖిల భారత రైతు పోరాట సమ న్వయ కమిటీ పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో వ్యవసాయ చట్టాల ను రద్దు చేయాలని చేపట్టిన రిలేదీక్ష ఆదివారం 13వ రోజుకు చేరుకుం ది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రైతు సంఘాల ఆధ్వర్యం లో ఢిల్లీలో చేపట్టిన నిరసన దీక్ష 31రోజులకు చేరుకున్నా కేంద్ర ప్రభు త్వం చర్చలు జరుపకుండ కాలయాపన చేస్తోందని విమర్శించారు. రోజు రోజుకు రైతుల ఆందోళనకు మద్దతు పెరుగుతోందని, కేం ద్ర ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. రాజస్థాన్‌లో రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీ బీజేపీ మిత్రపక్షం నుంచి బయటికి వచ్చి రైతులకు మద్దతు తెలుపుతోందని గుర్తుచేశారు. 29న జరిగే చర్చల్లో ప్రధానంగా సాగు చట్టాల రద్దు, రైతు కమిషన్‌ చేసిన మద్దతు ధర చట్టబద్ధమైన గ్యారంటీ కలగజేసే విధానాలు ఉండాలని, ఢిల్లీ సమీపంలో కాలుష్య ని రోధానికి సంబంధించి శిక్షార్హమైన నిబంధనల పరిధిలో రైతులను నిర్ణ యించే సవరణ చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లులో రైతుల ప్రయోజ నాలను కాపాడే మార్పులు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో  నాయకులు వెంకట్రాములు, ప్రశాంత్‌, నరసింహులు, నర్సిములు, నారా యణ, హజిమలాంగ్‌, రఫీ, ఇస్మాయిల్‌, కన్కప్ప పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T03:21:24+05:30 IST