నీ ప్రేమసాక్షిగా పుస్తకావిష్కరణ

ABN , First Publish Date - 2020-03-02T11:47:33+05:30 IST

మండలంలోని చెదురుపల్లికి చెందిన యువకవి పోలె వెంకటయ్య రచించిన నీప్రేమ సాక్షిగా (ప్రేమ మొగ్గలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని

నీ ప్రేమసాక్షిగా పుస్తకావిష్కరణ

వెల్దండ: మండలంలోని చెదురుపల్లికి చెందిన యువకవి పోలె వెంకటయ్య రచించిన నీప్రేమ సాక్షిగా (ప్రేమ మొగ్గలు) పుస్తకావిష్కరణ కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లోని సరస్వత పరిషత్‌లో జరిగింది. పాలమూరు సాహితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి హాజరై పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలమూరు కవులకు పుట్టినిల్లని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగిరెడ్డి వాసంతి, ఆచార్య రామారావు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-02T11:47:33+05:30 IST