-
-
Home » Telangana » Mahbubnagar » NCC
-
ఎన్‌సీసీతో క్రమశిక్షణ
ABN , First Publish Date - 2020-11-22T03:40:18+05:30 IST
ఎన్‌సీసీతోనే దేశభక్తి, సేవాదృక్పథం, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల వంటి సద్గుణాలు అలవడుతాయిని డాక్ట ర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నమ్మ అన్నారు.

బాదేపల్లి, నవంబరు 21: ఎన్‌సీసీతోనే దేశభక్తి, సేవాదృక్పథం, ఆత్మవిశ్వాసం, ధైర్యసాహసాలు, సమయపాలన, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, పట్టుదల వంటి సద్గుణాలు అలవడుతాయిని డాక్ట ర్ బీఆర్‌ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చిన్నమ్మ అన్నారు. శనివారం ఎన్‌సీసీ దినో త్సవం సందర్భంగా ఎన్‌సీసీ విద్యార్థులు ఆవరణ లో పరేడ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ప్రిన్సి పాల్ మాట్లాడుతూ ఎన్‌సీసీ విద్యార్థులు దేశానికి సెకండ్ లైన్ ఆర్మీగా ఉన్నారన్నారు. విద్యార్థులకు జాతీయ స్థాయిలో ఎన్‌ఐసీ, సీఏటీసీ, సీఆర్‌డీసీ, ఏఏసీ, ఆల్ ఇండియా ట్రైనింగ్ క్యాంప్ వంటి వాటి కి అవకాశం ఉంటుందన్నారు. ఈ క్యాంప్‌ల ద్వారా ఎ,బీ,సీల సర్టిఫికెట్లు పొందుతారని, ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ మహంతయ్య, ఎన్‌వో లెఫ్ట్‌నెంట్ యాద య్య, ఈఫ్ అధికారి రఘు, ఏఈవో రవీందర్‌సింగ్, పీఐ స్టాఫ్ మెంబర్ రాకేష్, అధ్యాపకులు సుభాషిణి, శ్రీనివాసనావు, ఎన్‌సీసీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.