సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

ABN , First Publish Date - 2020-09-01T08:03:48+05:30 IST

గ్రామాలలో పారిశుధ్యం, హరితహారంతో పాటు గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలపై ఉందని అదనపు కలెక్టర్‌ కోయ

సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాలి

 అదనపు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష


ధరూరు, ఆగస్టు 31 : గ్రామాలలో పారిశుధ్యం, హరితహారంతో పాటు గ్రామ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడాల్సిన బాధ్యత పంచాయతీ సెక్రటరీలపై ఉందని అదనపు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. ధరూరు మండల అభివృద్ధి కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం ధరూరు, కేటీదొడ్డి మండలాల పంచాయతీ సెక్రటరీలు, మిషన్‌ భగీరథ, విద్యుత్‌ ఏఈలతో సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం వారి విధులు, బాధ్యతలను పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. పారిశుధ్య నిబంధనలు పాటించని కుటుంబాలపై జరిమానాలు విధించాలని, కనీసం జరిమానా రూ.100 ఉండాలని, వారంలో కనీసం ఐదుగురికి జరిమాన విధించి గ్రామ పంచాయతీ ఖజానాకు జమచేయాలని ఆదేశించారు. మిషన్‌ భగీరథ వాటర్‌ ట్యాంక్‌లను ప్రతి నెల మూడు పర్యాయాలు శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.


ఉదయమే గ్రామాలలో ఉండి పారిశుధ్య పనులు చూసుకోవటంతోపాటు, సెగ్రిగేషన్‌ షెడ్లు, క్రిమిటోరియం, రైతు వేదికల నిర్మాణాలు త్వరగా పూర్తయ్యేలా చూడాలని పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. సమావేశంలో డీపీఓ కృష్ణ, ఎంపీడీఓలు జబ్బార్‌, జయరామ్‌నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-09-01T08:03:48+05:30 IST