ఎంపీడీవోల నూతన కార్యవర్గం ఎన్నిక

ABN , First Publish Date - 2020-02-16T06:13:07+05:30 IST

ఎంపీడీవోల నూతన కార్యవర్గం ఎన్నిక

ఎంపీడీవోల నూతన కార్యవర్గం ఎన్నిక

వనపర్తి రూరల్‌, ఫిబ్రవరి 15: జిల్లా కేంద్రంలోని జడ్పీ చైర్మన్‌ కార్యా లయంలో శనివారం మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల (ఎంపీడీవో) నూతన కార్యవర్గాన్ని సీఈవో సమక్షంలో ఎన్నుకున్నారు. ఈ ఎన్నికలలో జిల్లా మండల పరిషత్‌ అభివృద్ధి అధికారుల సంఘం అధ్యక్షుడిగా పెద్దమందడి ఎంపీడీవో నాగశేషాద్రిసూరి, ప్రధాన కార్యదర్శిగా గోపాల్‌పేట ఎంపీడీవో శ్రీ పాదు, ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా పాన్‌గల్‌ ఎంపీడీవో సాయిబృందను ఏకగ్రీ వంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని జడ్పీ చైర్మన్‌ లోక్‌ నాథ్‌రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు   మాట్లాడుతూ ఈ పదవులు ప్రస్తుతం తమకు మరింత బాధ్యతలను పెం చాయన్నారు.  ఉద్యోగి తన విధిని సక్రమంగా నిర్వర్తిస్తూ తన హక్కుల కోసం పోరాడటంతో తప్పులేదన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-02-16T06:13:07+05:30 IST