ఇచ్చిన మాట నిలుపుకుంటున్న టీఆర్‌ఎస్‌

ABN , First Publish Date - 2020-10-03T09:50:22+05:30 IST

ప్రజలకు ఇ చ్చిన మాటను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ని లు పుకుంటోందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు.

ఇచ్చిన మాట నిలుపుకుంటున్న టీఆర్‌ఎస్‌

నవాబ్‌పేటలో ఎంపీ మన్నె, ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన


నవాబ్‌పేట, అక్టోబరు2:  ప్రజలకు ఇ చ్చిన మాటను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ని లు పుకుంటోందని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఎ మ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని హన్మసానిపల్లి, రుద్రారం, హజీలాపూర్‌, పొమాల, చౌడూర్‌ గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థానలు, ప్రారంభోత్సవాలు వారు చేశారు.  ఈసం దర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రలో తెలంగాణ ప్రాంతం ఎడా రిగా మారి ప్రజలకు ఉపాధి కరువైంద న్నా రు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తున్నట్లు తెలిపారు. జడ్చర్ల  నియోజకవర్గంలో ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.  నవాబ్‌పేట మండలంలో సీతాఫలం ఎ క్కువ లభిస్తున్నందువల్ల ఈ ప్రాంతంలో  మహిళా సమైఖ్య ఆధ్వర్యంలో సీతాఫలం గుజ్జు తయారు కేంద్రం ఏర్పాటు చేస్తున్న ట్లు తెలిపారు.


దీనివల్ల నిత్యం 50 మంది కూలీలకు ఉపాధి లభిస్తుందన్నారు.  మండ ల పరిధిలోని తూక్యతండా నుంచా య న్మనగండ్ల వరకు ఉన్న మట్టిరోడ్డును బీటి రోడ్డుగా మార్చాలని తండావాసులు మాజీ ఉపసర్పంచ్‌ లక్ష్మయ్య, రాంచందర్‌ ఆధ్వ ర్యంలో ఎంపీ మన్నె, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి విన్నతి పత్రం సమర్పించారు. కూచూర్‌లో గాంధీ జయంతి సంధర్బంగా విగ్రహానికి నివాళ్లు అర్పించారు. నాయకులు  బాద్మి  శివకుమార్‌, ప్రభాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి,  అ నంతయ్య, నర్సింహులు, నాగిరెడ్డి, మధు సూదన్‌రెడ్డి ప్రతాప్‌, యన్మనగండ్ల లక్ష్మయ్య పాల్గొన్నారు.


మహనీయులను స్మరించుకోవాలి  

జడ్చర్ల : బేధాలు, భావాలు పక్కన పెట్టి మహనీయులందరినీ స్మరించుకుందామని జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని వాసవీకన్యకాపరమేశ్వరీదేవాలయ ఆర్చి వద్ద ఉన్న గాంఽధీ విగ్రహంతో పాటు గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. నాయకులు బాద్మి శివకుమార్‌,  కోడ్గల్‌ యాదయ్య, కాట్రేపల్లి లక్ష్మయ్య, పిట్టలమురళీ, రవిశంకర్‌, ఆర్యవైశ్యసంఘం నాయకులు పాల్గొన్నారు. 


మండల తహసీల్దార్‌ కార్యాలయం లో గాంధీజీ చిత్రపటానికి తహసీల్దార్‌ లక్ష్మీనారాయణ పూలమాల వేసి నివాళి అర్పిం చారు. కార్యక్రమంలో నయాబ్‌తహసీల్దార్‌ లు శ్రీనివాసులు, వెంకటేశ్వరీ, గిర్దావర్‌లు, సిబ్బంది పాల్గొన్నారు. అలాగే మండలం లోని పలు గ్రామాల్లో  గాంధీ విగ్రహాలకు, చిత్రపటాలకు సర్పంచులు నివాళి అర్పిం చారు.  ఆయా కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

 

గొప్ప నాయకుడు కొత్తకేశవులు 

జడ్చర్ల: భవిష్యత్‌తరాలకు ఉపయోగపడేవిధంగా జడ్చర్ల నియోజకవర్గంలో అభి వృద్ధి కార్యక్రమాలను నియోజకవర్గ మొదటి ఎమ్మెల్యే కొత్తకేశవులు చేపట్టారని  ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్ల మండల ప్రజాపరిషత్‌ కార్యాలయ ఆవరణలో శుక్రవారం కొత్తకేశవులు విగ్రహ పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొని ఆయ న మాట్లాడారు.  కార్యక్రమంలో మహబూబ్‌నగర్‌ ఎంపీ మన్నెశ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ లక్ష్మీశంకర్‌నాయక్‌, ఇంచార్జీ ఎంపీడీఓ జగదీశ్వర్‌,  మండలంలోని స ర్పంచ్‌లు, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కొత్తకేశవులు స్మారకసేవా ట్రస్ట్‌ సభ్యులు కొత్తజవహర్‌బాబు, సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-03T09:50:22+05:30 IST