‘పక్క మండలాలకు ఇసుక తరలిపోతోంది’

ABN , First Publish Date - 2020-09-12T10:33:11+05:30 IST

మండలంలోని పెద్ద వాగు నుంచి ఇతర మండలాలకు ఇసుక తరలిపోతోందని, మరో వైపు మండలంలో మా త్రం ఇసుకకు అనుమతులు ..

‘పక్క మండలాలకు ఇసుక తరలిపోతోంది’

మూసాపేట, సెప్టెంబరు 11: మండలంలోని పెద్ద వాగు నుంచి ఇతర మండలాలకు ఇసుక తరలిపోతోందని, మరో వైపు మండలంలో మా త్రం ఇసుకకు అనుమతులు ఇవ్వకుండా కొరత సృష్టిస్తున్నారని మండల సభలో సభ్యులు అధి కారులను నిలదీశారు. శుక్రవారం మండల సర్వ సభ్య సమవేశాన్ని ఎంపీపీ గూపని కళవాతి అధ్యక్షతన నిర్వహించారు. ఇసుక ఇతర మండలాలకు తరలకుండా మండలంలోని గ్రా మాల అవసరాలకు అనుమతులు ఇవ్వాలని తీ ర్మానం చేశారు. అధికారులు ఇష్టానుసారం వ్యవ హరిస్తున్నారని, తీరు మార్చుకోవాలని చెప్పారు.


గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలు సరిగ్గా పని చే యడం లేదని, అలాంటి కేంద్రాలను తరలిం చాలని కొమిరెడ్డిపల్లి సర్పంచ్‌ సాయిరెడ్డి సభ దృష్టికి తెచ్చారు. సీడీపీఓ శైలజాశ్రీ మాట్లాడుతూ పని చేయని టీచర్లపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మండల కేంద్రంలో నేషనల్‌ బ్యాంక్‌ లేనందున ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, బ్యాంక్‌ ఏర్పాటుకు మండల సభ తీర్మానం ద్వారా కలెక్టర్‌, ఉన్నతా ధికారులకు విన్నవించాలని జడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్‌ సూచించారు. దాంతో తీర్మానం చేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ఉమాదేవి, తహసీల్దార్‌ వరప్రసాద్‌, ఎంపీఓ సరోజ, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఎంపీ టీసీలు, సర్పంచ్‌లు, అధికారులు పాల్గొన్నారు.

Updated Date - 2020-09-12T10:33:11+05:30 IST