రాష్ట్రంలో 2,600 పైగా రైతు వేదికలు

ABN , First Publish Date - 2020-12-29T03:58:38+05:30 IST

రైతుల కోసం ప్రత్యేకం గా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రంలో 2,600పైగా రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.

రాష్ట్రంలో 2,600 పైగా రైతు వేదికలు
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి నిరంజన్‌ రెడ్డి

 - వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

- ధన్వాడలో రైతు వేదిక భవనం ప్రారంభం

ధన్వాడ, డిసెంబరు 28: రైతుల కోసం ప్రత్యేకం గా టీఆర్‌ఎస్‌ సర్కార్‌ రాష్ట్రంలో 2,600పైగా రైతు వేదిక భవనాలను నిర్మిస్తున్నామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ధన్వాడలో సోమవా రం మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ రైతు వేదిక భవనంతో పాటు గోదాంలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం లో మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ మొదటిగా ధన్వాడలో రైతు వేదిక ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలో ధాన్యం నిల్వ కోసం ప్రత్యేకంగా కోట్ల రూపాయిలు వెచ్చించి గోదాంలు నిర్మిస్తున్నామన్నారు. గతంలో కేవలం 20 లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసుకోవడానికి మాత్ర మే వీలు ఉండేదని,  ఇప్పుడు  50లక్షల టన్నుల ధాన్యం నిల్వ చేసుకోవడానికి గోదాంలు ఏర్పాటు చే శామన్నారు. ఈ సందర్భంగా మంత్రుల ను శాలు వా, పూలమాలలతో ఘనంగా సన్మానిం చారు. కా ర్యక్రమంలో ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేం దర్‌రెడ్డి, చిట్టెం రాంమోహన్‌రెడ్డి, కలెక్టర్‌ హరిచం దన, జడ్పీ చైర్‌పర్సన్‌ వనజ, వైస్‌ చైర్‌పర్సన్‌ సురే ఖ రెడ్డి, జడ్పీటీసీ సభ్యురాలు విమల,  అధి కారు లు పాల్గొన్నారు.  బీజేపీ నాయకులను అరెస్టు చేసి మరికల్‌ పో లీస్‌స్టేషన్‌కు తరలించారు. 

Updated Date - 2020-12-29T03:58:38+05:30 IST