మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షను..పకడ్బందీగా నిర్వహించాలి: డీఆర్వో

ABN , First Publish Date - 2020-10-21T06:22:09+05:30 IST

ఈనెల 27నుంచి 29 వరకు నిర్వహించనున్న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చా లని డీఆర్వో మధుసూదన్‌ నాయక్‌ అన్నారు.

మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షను..పకడ్బందీగా నిర్వహించాలి: డీఆర్వో

నాగర్‌కర్నూల్‌ కలెక్టరేట్‌, అక్టోబరు20: ఈనెల 27నుంచి 29 వరకు నిర్వహించనున్న మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్షను పకడ్బందీగా నిర్వహిం చా లని డీఆర్వో మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. మం గళవారం  కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో మోడల్‌ స్కూల్‌ ప్రవేశ పరీక్ష నిర్వాహణకు తీసుకో వాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా డీఆర్వో మాట్లాడుతూ పరీక్ష కేంద్రాలలో ని బంధనల ప్రకారం విద్యార్థులకు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కోడేరు, వెల్డండ మండల కేంద్రాల్లో పరీక్షలు రాయనున్న విద్యార్థుల కోసం కొల్లాపూర్‌, కల్వకుర్తి నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. ప్రవేశ పరీక్షకు సంబం ధించిన ప్రశ్నాపత్రాలు గురువారం జిల్లా కేంద్రానికి చేరుకోనున్నాయని, 23న సంబంధిత మండల కేంద్రంలోని పోలీసుస్టేషన్లలో భద్ర పరుచను న్నామని పేర్కొన్నారు. ఈ నెల 27నుంచి 29 వర కు ప్రతి రోజు ఉదయం 10 నుంచి 12ః30గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు.


జిల్లాలో మొత్తం 1882మంది విద్యార్థులు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఈ నెల 27న ఆరో తరగతికి, 28న ఏడు, ఎనిమిదో తరగతులకు, 29న తొమ్మిది, పదో తరగతులకు ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయని తె లిపారు. సమావేశంలో డీఈఓ గోవిందరాజులు, జిల్లా పాఠశాల పరీక్షల నిర్వాహణ అధికారి రాజశే ఖర్‌రావు, డీఎల్పీఓ రామ్మోహన్‌రావు, సీఐ గాం ధీ నాయక్‌, విద్యుత్‌ శాఖ ఏఈ శ్రీనివాస్‌, ఆర్టీసీ డీఎం రామారావు, వైద్యశాఖ నరసింహా, కలెక్టరేట్‌ సిబ్బంది వెంకట్‌, విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2020-10-21T06:22:09+05:30 IST