ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కలెక్టర్‌ సన్మానం

ABN , First Publish Date - 2020-11-26T02:54:17+05:30 IST

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన జిల్లాకు చెందిన ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు.

ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు కలెక్టర్‌ సన్మానం
గోరటి వెంకన్నను సన్మానిస్తున్న జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌

నాగర్‌కర్నూల్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికైన జిల్లాకు చెందిన ప్రజాగాయకుడు ఎమ్మెల్సీ గోరటి వెంకన్నను జిల్లా కలెక్టర్‌ ఎల్‌పీ.శర్మన్‌ బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకొని శాలువాతో ఘనంగా సన్మానించి అభినందించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించి తన గాత్రం ద్వారా ప్రజలందరి, రాష్ట్ర ముఖ్యమంత్రి మన్న నలు పొంది ఎమ్మెల్సీగా ఎంపిక కావడం పట్ల కలెక్టర్‌ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధికి సహాయ సహకారాలం దించాలని గోరటి వెంకన్నను కలెక్టర్‌ కోరారు. 


Read more