క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-20T04:02:05+05:30 IST

క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ని ఎంబీ చర్చిలో శనివారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి నియోజకవర్గానికి చెందిన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దుస్తుల కిట్లను పంపిణీ చేశారు.

క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే
పేటలో క్రిస్మస్‌ కానుకలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి

నారాయణపేట టౌన్‌, డిసెంబరు 19 : క్రిస్మస్‌ పండుగను పురస్కరించుకొని జిల్లా కేంద్రంలో ని ఎంబీ చర్చిలో శనివారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డి నియోజకవర్గానికి చెందిన క్రైస్తవులకు పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దుస్తుల కిట్లను పంపిణీ చేశారు. ఏ ధర్మమైనా బోధించేది ప్రేమ, దయ, దానం చేయడమని తెలిపారు. కరోనా దృష్ట్యా క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేయాలని పా స్టర్లను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్‌రెడ్డి, సీపీఓ భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ దానయ్య, డీటీ ప్రమీల, కౌన్సిలర్‌ మహేష్‌, పాస్టర్లు పాల్గొన్నారు. 


ఎమ్మెల్యేకు విద్యుత్‌ కార్మికుల వినతి 


నారాయణపేట : జిల్లా కేంద్రంలో విద్యుత్‌ కార్మికులకు విశ్రాంతి భవనానికి స్థలం కేటాయిం చాలని కోరుతూ 1104యూనియన్‌ అధ్యక్షుడు రఘు, డిస్కం కార్యదర్శి రవీంద్రచారిల ఆధ్వర్యం లో శనివారం ఎమ్మెల్యే ఎస్‌ఆర్‌రెడ్డిని క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం సభ్యులు గోవింద్‌రాజు, ఆనంద్‌, వెంకటేష్‌, మహ్మద్‌ పాషా పాల్గొన్నారు.

Read more