రైతులను ముంచేందుకే కొత్త వ్యవసాయ చట్టాలు
ABN , First Publish Date - 2020-12-21T02:37:03+05:30 IST
కేంద్ర ప్రభుత్వం రైతులను ముం చేందుకు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం రైతులను ముం చేందుకు కొత్త వ్యవసాయ చట్టాలను తీసుకు వచ్చిందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి తెలిపారు. గట్టు మండలం అరగిద్దెలో వ్యవసాయ చట్టాలకు వ్య తిరేకంగా ఇంటింటా పిడికెడు బియ్యం బిక్షాటన కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నెలరోజులుగా ఢిల్లీలో ఈ చట్టాలను రద్దు చేయాలని రైతులు చేస్తున్న ఆందోళనకు తెలంగాణలోని టీఆర్‌ఎస్ పార్టీ మద్దతు ఇచ్చిందన్నారు. ఇదే అదనుగా భావించిన ఎమ్మెల్యే గద్వాల నియోజక వర్గంలో ఐదు మండలాల్లో ఇంటింటా పిడికెడు బియ్యం బిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి బీజేపీపై వ్యతిరేకంగా మాట్లాడి తన ఉనికికి మరింతగా బలం చేకూర్చుకున్నారు. ఈ నెల 14న తొలి సారి మల్దకల్ మం డలంలోని ఇంటింటా పిడికెడు బియ్యం భిక్షాటన కార్యక్రమాన్ని ప్రారంభించా రు. అక్కడి నుంచి ధరూర్, కేటీదొడ్డి, గద్వాల రూరల్, గట్టు మండలంలోని అరగిద్దె గ్రామాల్లో భిక్షాటన పూర్తిచేశారు. దీంతో రాజకీయంగా లబ్ధి పొందడంతో పాటు వ్యవసాయ చట్టాలతో కలిగే నష్టాలను రైతులకు వివరిస్తున్నారు.