గండిని పరిశీలించిన ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-14T02:58:14+05:30 IST

అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ఆర్డీఎస్‌ గండిని పరిశీలించారు.

గండిని పరిశీలించిన ఎమ్మెల్యే
ఆర్డీఎస్‌ గండిని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే అబ్రహాం

అయిజ, డిసెంబరు 13: అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహాం ఆర్డీఎస్‌ గండిని పరిశీలించారు. సిందనూర్‌ గ్రామ సమీపంలో శనివారం తెల్లవారు జామున కాలువకు గండిపడింది. ఈ నేపథ్యంలో అబ్రహాం ఆదివారం టీఆర్‌ఎస్‌ నాయకులు కార్యకర్తలతో కలిసి వెళ్లి పరిశీలించారు. త్వరితగతిన గండిని పూడ్చివేయాల్సిందిగా అధికారులకు తెలిపారు. రైతులను ఆదుకుంటామని తెలిపారు. అనం తరం ఉప్పల, చిన్నతాండ్రపాడు గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంబించారు. రైతు పండించిన ప్రతి దాన్యానికి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేస్తుందని తెలిపారు. కేసీఆర్‌ రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తారని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సింగిల్‌విండో అధ్యక్షుడు పో తు ల మధుసూదన్‌రెడ్డి, అలంపూర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పటేల్‌ విష్ణువర్దన్‌రెడ్డి, ఎక్లాస్‌పూర్‌ నర్సింహారెడ్డి, రవిరెడ్డి, బీ.నర్సింహులు, బ్రహ్మయ్య, చెన్న య్య, జనార్దన్‌గౌడు, మేడికొండ వెంకటేష్‌, గోపాలకృష్ణ, చిన్నహన్మంతు, ప్రకాష్‌గౌడు, ఉప్పల ఎంపీటీసీ ప్రహ్లదరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఓబీసీ కార్యదర్శి షెక్షావలి ఆచారి, గిత్తల దేవరాజు, తిప్పన్న, జయన్న, పాండు, సాంబ శివుడు ఆర్డీఎస్‌ గండిని పరిశీలించారు. దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించి రైతులను ఆర్థికంగా ఆదుకోవాలని ఈ సందర్బంగా వారు డిమాండ్‌ చేశారు. 

Updated Date - 2020-12-14T02:58:14+05:30 IST