-
-
Home » Telangana » Mahbubnagar » mla narendar reddy
-
అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి : ఎమ్మెల్యే పట్నం
ABN , First Publish Date - 2020-12-07T04:25:28+05:30 IST
కోస్గి మునిసిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా గుత్తేదారులు చర్యలు తీసుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు.

కోస్గి, డిసెంబరు 6 : కోస్గి మునిసిపాలిటీలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులు సకాలంలో పూర్తయ్యేలా గుత్తేదారులు చర్యలు తీసుకోవాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి అన్నా రు. ఆదివారం పట్టణంలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ సనులు, సైడ్‌డ్రెయినేజీ నిర్మాణం, పా ర్క్‌ల ఏర్పాటు, మార్కెట్ యార్డు పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కోస్గి మునిసిపల్ పరిధిలోని అన్ని వార్డులను అభివృద్ది చేసేందుకు ప్రణాళికలు సిద్దం చేశామ న్నారు. కోస్గి బస్‌డిపో,బస్టాండ్ పనులు కుడా త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామ న్నారు. ఈ కార్యక్రమంలోఎంపిపి మధుకర్‌రావు, కౌన్సిలర్లు మాస్టర్ శ్రీనివాస్, జనార్ధన్‌రెడ్డి, బాలేష్, లింగంలక్ష్మి, బందెప్ప, కో ఆప్షన్ సభ్యులు ఎండీ నషీర్, అమృతమ్మ, నాయకులు మ్యాకల రాజేష్, హరికుమార్, బాలరాజు, జగదీశ్వర్‌రెడ్డి, హన్మంత్‌రెడ్డి, భీంరెడ్డి, హన్మంత్ ఉన్నారు.